Healthy Eyes : కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే!

కంటి ఆరోగ్యం కోసం ఆకుపచ్చ, పసుపు, ఆరంజ్ , రంగుల్లో ఉండే పళ్లను తినాలి. పచ్చి కూరగాయల్ని తినాలి. వీటిల్లో ఉండే కరెటోనాయిడ్స్ అధికంగా ఉంటాయి.

Healthy Eyes : కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే!

Eyes Healthy

Healthy Eyes : సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు. కళ్ల విషయంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారపు అలవాట్లను పెంపొందించుకోవాలి. జంక్ ఫుడ్, కూల్ డ్రింక్స్ లాంటివి తాగకూడదు. ఇవి శరీరంతోపాటు కంటి ఆరోగ్యం పైన ప్రభావం చూపుతాయి. పోషక పదార్ధాలున్న ఆహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల కంటి చూపు దెబ్బతినకుండా ఉంటుంది. కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే రిలాక్సింగ్ పద్ధతులను కూడా తప్పనిసరిగా పాటించాలి. వీటి వల్ల కంటికి రక్త ప్రసరణ సాఫీగా సాగుతుంది.

పుస్తక పఠనంలో కళ్లార్పకుండా చదువటం ఏమాత్రం మంచిది కాదు. కళ్లను మధ్యమధ్యలో ఆర్పుతుండటం వల్ల కంటికి విశ్రాంతి లభిస్తుంది. కళ్లు పొడారిపోకుండా ఉంటాయి. డీహైడ్రేషన్ వల్ల కళ్లు తేమలేకుండా పోతాయి. తగినంత త్రాగునీరు తీసుకోవటం వల్ల కళ్లకు మేలు కలుగుతుంది. బెడ్ మీద పడుకుని పుస్తకాలు చదవటం వంటివి చేయరాదు. దీని వల్ల కళ్లు అలసటకు గురవుతాయి. రాత్రిళ్లు, పగలు వెలుతురు బాగా ఉన్న ప్రదేశంలోనే కూర్చుని చదువుకోవాలి.

కంటి ఆరోగ్యం కోసం ఆకుపచ్చ, పసుపు, ఆరంజ్ , రంగుల్లో ఉండే పళ్లను తినాలి. పచ్చి కూరగాయల్ని తినాలి. వీటిల్లో ఉండే కరెటోనాయిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి కళ్లకు మేలు కలుగుతుంది. రోజు కేరట్ జ్యూసు తాగితే కళ్లు ఎంతో ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే పుదీనా, కొత్తి మీర రంసం మంచివి. వీటిల్లో కొద్దిగా ఉప్పు, నిమ్మరసం కలిపి తాగితే ఎంతో రుచిగా ఉంటాయి. మీగడ తీసిన పాలు, పెరుగు రోజూ తీసుకోవాలి.

టొమాటో పండును గుండ్రని ముక్కలుగా తరిగి తింటే కళ్లకు ఎంతో మంచిది. నల్ల ద్రాక్ష, ఎర్ర ద్రాక్ష , బెర్రీస్ పళ్లు తింటే కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.దానిమ్మ , బొప్పాయి కంటి చూపు మెరుగుపర్చటంలో తోడ్పడతాయి. ఆర్టిఫిషియల్ కలర్స్, కెఫినేటెడ్ డ్రింక్స్, ఫ్లేవర్ చిరుతుళ్లను తీసుకోకూడదు. ఇలాంటి వాటి వల్ల పోషకాలు లభించకపోను కంటి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.