Cinnamon Tea : అధిక బరువు తగ్గాలన్న ప్రయత్నాల్లో ఉన్నారా? అయితే రోజుకు రెండు పూటలా ఈ టీని తీసుకోండి!

దాల్చినచెక్కలో పోషక విలువలు ఎక్కువ మోతాదులో ఉంటాయి. అందుకే దీన్ని వంటల్లో ఉపయోగిస్తారు. దాల్చిన చెక్క బెరడు నుంచి వచ్చే మసాలాను వివిధ రకాల ఆహారాలు, పానీయాలలో ఉపయోగించవచ్చు. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.

Cinnamon Tea : అధిక బరువు తగ్గాలన్న ప్రయత్నాల్లో ఉన్నారా? అయితే రోజుకు రెండు పూటలా ఈ టీని తీసుకోండి!

cinnamon tea

Cinnamon Tea : అధిక బరువు అనేది ప్రస్తుతం పెద్ద సమస్యగా మారింది. జీవనశైలిలో మార్పులు, మారిన ఆహారపు అలవాట్లు, నిద్రలేమి, పని ఒత్తిడి , ఆందోళనల వల్ల శరీరంలో కొవ్వు పెరిగిపోతుంది. అధిక బరువు వల్ల రక్తపోటు, టైప్-2 డయాబెటిస్, గుండె సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. శరీర బరువు తగ్గించుకోవడానికి వంటగదిలో సులభంగా దొరికే దాల్చిన చెక్క చాలా బాగా ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు.

దాల్చినచెక్కలో పోషక విలువలు ఎక్కువ మోతాదులో ఉంటాయి. అందుకే దీన్ని వంటల్లో ఉపయోగిస్తారు. దాల్చిన చెక్క బెరడు నుంచి వచ్చే మసాలాను వివిధ రకాల ఆహారాలు, పానీయాలలో ఉపయోగించవచ్చు. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. దాల్చిన చెక్క టీ ని రోజుకు రెండు పూటలా తాగడం వల్ల చాలా త్వరగా బరువు తగ్గవచ్చు. దాల్చిన చెక్క టీ ని ఉదయం పరగడుపున అలాగే రాత్రి పడుకునే ముందు తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగేలా చేస్తుంది. దీని వల్ల త్వరగా బరువు తగ్గవచ్చు. అలాగే పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయిన వారు ఇంట్లోనే ఈ డ్రింక్ ను తయారు చేసుకుని తాగడం వల్ల చక్కటి ఫలితాలను పొందవచ్చు.

దాల్చిన చెక్క టీ తయారీ ;

ఈ టీ ని తయారు చేసుకోవడం కూడా చాలా సులువు. ఒక గిన్నెలో ఒక లీటర్ నీటిని పోసి వేడి చేయాలి. ఈ డ్రింక్ ను తయారు చేసుకోవడానికి గాను ముందుగా ఒక గిన్నెలో నీటిని పోసి వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక అందులో 2 టేబుల్ స్పూన్ల దాల్చిన చెక్క పొడిని వేసి బాగా మరిగించాలి. తరువాత దీనిని వడకట్టి ఒక కప్పులోకి తీసుకోవాలి. తరువాత అందులో రుచికి తగినంత తేనెను కలిపి తాగాలి. మిగిలిన నీటిని ఫ్రిజ్ లో నిల్వ చేసుకుని మరుసటి రోజు కూడా తాగవచ్చు. గ్రీన్ టీలో కూడా టీస్పూన్ తేనె, అర టీస్పూన్ దాల్చిన చెక్క జోడించి తాగితే వెయిట్ లాస్ త్వరగా అవ్వొచ్చు.

దాల్చినచెక్క టీ చాలా ప్రయోజనకరమైన సమ్మేళనాలతో నిండి ఉంది, ఇవి బరువు తగ్గడానికి సహాయపడటం, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, ఋతు తిమ్మిరిని తగ్గించడం మరియు వాపు మరియు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.