Wearing Tight Jeans : టైట్ జీన్స్ వేసుకుంటున్నారా? రక్తప్రసరణ, నాడీ వ్యవస్ధపై తీవ్ర ప్రభావం?

పురుషులలో వంధ్యత్వానికి టైట్ జీన్స్ కారణమని పరిశోధనల్లో తేలింది. స్కిన్నీ జీన్స్ ధరించడం పురుషుల్లో వారి పునరుత్పత్తి ఆరోగ్యం పై ప్రభావం పడుతుంది. ఇతర ఆరోగ్య సమస్యలతో పాటు మూత్రపరమైన సమస్యలను కలిగిస్తుంది.

Wearing Tight Jeans : టైట్ జీన్స్ వేసుకుంటున్నారా? రక్తప్రసరణ, నాడీ వ్యవస్ధపై తీవ్ర ప్రభావం?

Wearing Tight Jeans :

Wearing Tight Jeans : ఫ్యాషన్ అప్పుడప్పుడు మన ఆరోగ్యానికి ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా కుర్రకారు వేసే స్కిన్నీ జీన్స్ వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాళ్లలోని కండరాలు , నరాల ఫైబర్‌లను జీన్స్ దెబ్బతీస్తుందని, తద్వారా నడవడం కష్టమవుతుందని అధ్యయనంలో తేలింది. న్యూరాలజీ న్యూరోసర్జరీ & సైకియాట్రీ జర్నల్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, 35 ఏళ్ల మహిళ రెండు చీలమండలలో తీవ్రమైన నొప్పికి ఆమె ధరించే స్కిన్నీ జీన్స్ కారణమని వైద్యులు కనుగొన్నారు.

టైట్ జీన్స్ కంపార్ట్మెంట్ సిండ్రోమ్ అభివృద్ధికి దారితీస్తుంది. ఇది కాళ్ల కండరాలకు రక్త సరఫరాను తగ్గిస్తుంది. దీని వలన కండరాలు వాపు , నరాలు బలహీనంగా మారతాయి. అంతేకాకుండా జననేంద్రియ వాహిక వ్యాధిపై పరిశోధన జర్నల్ లో ప్రచురించిన దాని ప్రకారం బిగుతుగా ఉండే జీన్స్ , స్కిన్నీ ప్యాంటు వల్వోడినియాకు కారణమవుతుందని కనుగొంది.
టైట్ ఫిట్టింగ్ జీన్స్ కూడా యోని చికాకు, ఈస్ట్ ఇన్ఫెక్షన్, బాక్టీరియల్ వాగినోసిస్‌కు కారణమౌతుంది. జీన్స్ దిగువ శరీరంలో గాలి ప్రవాహాన్ని, రక్త ప్రవాహాన్ని పరిమితం చేయడం కారణంగా ఈ సమస్యలు కలుగుతాయి.

స్కిన్నీ జీన్స్ వల్ల కండరాలు మరియు నరాలు దెబ్బతింటాయి. జర్నల్ ఆఫ్ న్యూరాలజీ, న్యూరోసర్జరీ మరియు సైకియాట్రీ వారి కేస్ స్టడీస్‌లో స్కిన్నీ జీన్స్‌లో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కంపార్ట్‌మెంట్ సిండ్రోమ్ అనే పరిస్థితి ఏర్పడుతుందని కనుగొన్నారు. ఇది శరీరంలోని నిర్దిష్ట భాగానికి రక్త సరఫరా నిలిపివేయబడినప్పుడు సంభవిస్తుంది. ఈ సిండ్రోమ్ నాడి, కండరాలు మరియు రక్త నాళాల చుట్టూ వాపు ను కలుగజేస్తుంది.

పురుషులలో వంధ్యత్వానికి టైట్ జీన్స్ కారణమని పరిశోధనల్లో తేలింది. స్కిన్నీ జీన్స్ ధరించడం పురుషుల్లో వారి పునరుత్పత్తి ఆరోగ్యం పై ప్రభావం పడుతుంది. ఇతర ఆరోగ్య సమస్యలతో పాటు మూత్రపరమైన సమస్యలను కలిగిస్తుంది. స్కిన్నీ జీన్స్‌ను నిరంతరం ఉపయోగించే పురుషులలో టెస్టిక్యులర్ టోర్షన్ అనేది ఒక సాధారణ పరిస్థితి. ఈ జీన్స్ ఎక్కువసేపు ధరించడం వల్ల పురుషుల్లో క్యాన్సర్ మరియు ప్రైవేట్ పార్ట్స్ దెబ్బతింటాయి.

స్కిన్నీ జీన్స్‌ని ఉపయోగించడం వల్ల పురుషులు మరియు స్త్రీలలో వీపుపై ప్రభావం చూపే డిస్క్‌లలో ఒత్తిడి పెరుగుతుంది. బిగుతైన ప్యాంటు ధరించినప్పుడు అసాధారణ కదలిక , భంగిమ కారణంగా పురుషులు, స్త్రీలలో వెన్నెముక , పొత్తికడుపులో సమస్యలు ఉత్పన్నం అవుతాయి. నరాల అవరోధానికి దారితీసే భంగిమ వల్ల కలిగే ఈ సమస్యను “స్కిన్నీ జీన్ సిండ్రోమ్” అంటారు.

బిగుతుగా ఉండే జీన్స్ పై బెల్ట్ ధరించడం వల్ల పొత్తికడుపు మరియు కటి ప్రాంతంలో నొప్పి వస్తుంది. శోషరస కణుపులలో రక్త ప్రవాహాన్ని పరిమితం చేస్తుంది. తుంటి కీళ్ళు మరియు వెన్నెముకకు కూడా జీన్స్ కారణంగా ఇబ్బందులు కలుగుతాయి. అందుకే అప్పుడప్పుడు మినహా రోజువారిగా జీన్స్ ధరించటం ఏమాత్రం శ్రేయస్కరం కాదని నిపుణులు చెబుతున్నారు.