Fitness Exercisers : ఫిట్ నెస్ వ్యాయామాలు చేసే వారు శక్తి కోసం ఎలాంటి ఆహారాలు తీసుకోవాలంటే?

వాల్ న‌ట్స్ లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. అలాగే, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ఫైబ‌ర్‌, విట‌మిన్ ఇ, ఇంకా ఇత‌ర అనేక పోష‌కాలు వాల్ న‌ట్స్‌లో ఉంటాయి. అందువ‌ల్ల రోజూ ర‌న్నింగ్ చేసేవారు వాల్ న‌ట్స్ ను తింటే శ‌క్తితోపాటు పోష‌కాల‌ు లభిస్తాయి.

Fitness Exercisers : ఫిట్ నెస్ వ్యాయామాలు చేసే వారు శక్తి కోసం ఎలాంటి ఆహారాలు తీసుకోవాలంటే?

What foods should fitness exercisers eat for energy?

Fitness Exercisers : శారీర‌క‌, మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌తం అవుతున్నవారికి ఫిట్ నెస్ వ్యాయామాలు ఎంతో మేలు చేస్తాయి. వాకింగ్, రన్నింగ్, జాగింగ్ వంటి వాటిని క్రమం తప్పకుండా చేయటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలగటంతోపాటు ఒత్తిడి నుండి బయటపడవచ్చు. రోజువారిగా వ్యాయామాల వల్ల అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు. బ‌రువు త‌గ్గుతారు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. డ‌యాబెటిస్ త‌గ్గుతుంది. అయితే రోజూ వ్యాయామాలు చేసేవారు శ‌క్తి కోసం రోజూ కొన్ని ర‌కాల ఆహారాల‌ను తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. వీటి వల్ల శక్తిని పెంచుకోవచ్చు. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

నిమ్మ‌కాయ‌ల్లో విట‌మిన్ సి, కాల్షియం అధికంగా ఉంటాయి. అందువ‌ల్ల రోజూ నిమ్మ‌ర‌సం తీసుకుంటే ఎముక‌లు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే హెర్బ‌ల్ టీ ల‌లో క‌లిపి తీసుకోవ‌చ్చు. దీని వ‌ల్ల ఎముక‌లు ఆరోగ్యంగా ఉంటాయి. చెర్రీ పండ్ల‌లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ర‌న్నింగ్ చేసిన అనంత‌రం వ‌చ్చే నొప్పుల‌ను, వాపుల‌ను త‌గ్గిస్తాయి. వ్యాయామాలు చేసేవారు ఎలాంటి నొప్పులు, వాపులు రాకుండా ఉండాలంటే రోజూ చెర్రీ పండ్ల‌ను ఒక క‌ప్పు తినటం మేలు.

చియా విత్త‌నాల్లో ఫైబ‌ర్‌, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అలాగే కాల్షియం, ఐర‌న్‌, ప్రోటీన్లు కూడా ఎక్కువ‌గానే ఉంటాయి. వీటిని రాత్రంతా నీటిలో నాన‌బెట్టి ఉద‌యం వ్యాయామాల అనంత‌రం తిన‌వ‌చ్చు. దీంతో డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌గా ఉండ‌వ‌చ్చు. వీటి ద్వారా అధికంగా ఫైబ‌ర్ ల‌భిస్తుంది. జీర్ణ స‌మస్య‌లు త‌లెత్త‌కుండా ఉంటాయి. ర‌న్నింగ్ చేసేవారు రోజూ క‌చ్చితంగా తినాల్సిన ఆహారాల్లో అర‌టి పండు ముఖ్యమైనది. దీనని తినటం వల్ల క‌డుపు నిండిన భావ‌న క‌లుగుతుంది. శ‌రీరానికి త‌క్ష‌ణ శ‌క్తిని అందిస్తుంది. అల‌సటగా ఉన్నవారు దీనిని తింటే వెంట‌నే శ‌క్తిని పొంద‌వ‌చ్చు. అర‌టి పండ్ల‌లో విట‌మిన్ బి6 ఉంటుంది.

వాల్ న‌ట్స్ లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. అలాగే, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ఫైబ‌ర్‌, విట‌మిన్ ఇ, ఇంకా ఇత‌ర అనేక పోష‌కాలు వాల్ న‌ట్స్‌లో ఉంటాయి. అందువ‌ల్ల రోజూ ర‌న్నింగ్ చేసేవారు వాల్ న‌ట్స్ ను తింటే శ‌క్తితోపాటు పోష‌కాల‌ు లభిస్తాయి. దీంతో ఎముక‌లు దృఢంగా మారుతాయి. అధిక బ‌రువు త‌గ్గాల‌నుకునేవారు రోజూ ర‌న్నింగ్ చేశాక వాల్ న‌ట్స్ ను తింటే ఇంకా ఎక్కువ ఫ‌లితం ఉంటుంది. త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గుతారు.