What is myositis : సమంతకు సీరియస్ జబ్బు.. అసలు మయోసైటిస్ అంటే ఏమిటి? లక్షణాలేంటి? ఎందుకు వస్తుంది? చికిత్స ఉందా?

మయోసైటిస్ అనేది అరుదైన వ్యాధి. లక్షలో నలుగురి నుంచి 20 మందికి సోకే జబ్బు. వైద్య పరిభాషలో చెప్పాలంటే.. ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్‌. ఇది అరుదైన వ్యాధి మాత్రమే కాదు.. నొప్పులు, అలసటతో పేషెంట్‌కు నరకం చూపిస్తుంటుంది. ఈ వ్యాధిలో మొత్తం ఐదు రకాలు ఉన్నాయి.

What is myositis : సమంతకు సీరియస్ జబ్బు.. అసలు మయోసైటిస్ అంటే ఏమిటి? లక్షణాలేంటి? ఎందుకు వస్తుంది? చికిత్స ఉందా?

What is myositis : మయోసైటిస్.. ఇప్పుడు దీని గురించి పెద్ద డిస్కషన్ జరుగుతోంది. కారణం.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఈ వ్యాధి బారిన పడటమే. తాను మయోసైటిస్ అనే జబ్బుతో బాధపడుతున్నట్టు స్వయంగా సమంత ఇన్ స్టాలో తెలిపింది. నటి సమంతకు మయోసైటిస్‌ సోకిందనే వార్త.. ఆమె ఫ్యా‍న్స్‌తో పాటు తారాలోకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. సమంత త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.

సమంత ప్రకటనతో ఇప్పుడు అందరి దృష్టి మయోసైటిస్ పై పడింది. అసలు మయోసైటిస్ అంటే ఏంటి? ఆ జబ్బు లక్షణాలు ఏంటి? ఎవరికి సోకుతుంది? ఎందుకు వస్తుంది? అనేది హాట్ టాపిక్ గా మారింది. అంతా దీని గురించి ఆరా తీస్తున్నారు.

మయోసైటిస్ అనేది అరుదైన వ్యాధి. సీరియస్ జబ్బు. పలు సందర్భాల్లో ప్రాణాంతక వ్యాధి. లక్షలో నలుగురి నుంచి 20 మందికి సోకే జబ్బు. వైద్య పరిభాషలో చెప్పాలంటే.. ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్‌. ఇది అరుదైన వ్యాధి మాత్రమే కాదు.. నొప్పులు, అలసటతో పేషెంట్‌కు నరకం చూపిస్తుంటుంది.

Samantha: సమంతకు ఆ సీరియస్ జబ్బు.. త్వరలోనే కోలుకుంటానని ప్రకటన

వాటర్‌ బాటిల్‌ మొదలుకుని బకెట్‌ నీటిని ఎత్తడానికి కూడా కష్టపడాల్సి వస్తుంది. ఒక చెయిర్‌ను అటు ఇటు జరపడానికి ఇబ్బంది పడతారు. సాధారణంగా వయసు మీద పడిన సమయంలో ఇలాంటివి తప్పదు. అయితే ఇలాంటి బలహీనతలే మధ్యవయసులో.. అదీ ప్రతీరోజూ కనిపించిందంటే.. అది ‘మయోసైటిస్‌’ లక్షణంగా భావించాల్సి ఉంటుందని డాక్టర్లు అంటున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

మయోసైటిస్ వ్యాధితో కండరాలు వాపునకు గురవుతాయి. గాయాలైనా, ఇన్ఫెక్షన్లు వచ్చినా, రోగనిరోధక శక్తి క్షీణించినా ఈ వ్యాధి వస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. దీంతో కండరాలు బలహీనపడతాయి. కొద్దిగా నడిచినా, నిలబడ్డా అలసిపోతారు. శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడతారు. ఆహారం మింగడానికి కూడా అవస్థ పడతారు. ఫిజికల్ థెరపీ, హీట్ థెరపీ, వ్యాయామంతో ఈ వ్యాధిని నయం చేసుకోవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. ఈ వ్యాధితో ఒక్కోసారి అంగవైకల్యం, పరిస్థితి చేయిదాటితే మరణమూ సంభవించవచ్చన్నారు.

ఇక ఈ వ్యాధికి చికిత్సను ముందుగా స్టెరాయిడ్స్‌తోనే ప్రారంభిస్తారు. ట్యాబ్లెట్లు లేదా ఇంజెక్షన్ల రూపంలో శరీరంలోకి స్టెరాయిడ్స్‌ను పంపి, ముందుగా కండరాల నొప్పులను తగ్గించేందుకు ప్రయత్నిస్తారు. చికిత్స తీసుకుంటున్న సమయంలో ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలని కూడా వైద్యులు సూచిస్తారు. రోజూవారి వ్యాయామం, ఫిజియోథెరఫీ వంటివి ఈ వ్యాధిని తగ్గించడంలో చాలా చక్కగా పనిచేస్తాయని డాక్టర్లు చెబుతారు.