ICMR Guidelines : ఆహార అలవాట్లపై ICMR మార్గదర్శకాలు.. ఎప్పుడు.. ఎలా? ఏమి తినాలి?

ICMR Guidelines : శరీరానికి కావాల్సిన పోషకాలు, లవణాలు అందుతున్నాయా...? ఈ అవగాహన తెచ్చుకుంటే...జీవితకాలం ఆస్పత్రులకు దూరంగా ఉండొచ్చు. దీనిపై ICMR కొన్ని సూచనలు చేసింది.

ICMR Guidelines : ఆహార అలవాట్లపై ICMR మార్గదర్శకాలు.. ఎప్పుడు.. ఎలా? ఏమి తినాలి?

ICMR Guidelines on Dietary Habits

ICMR Guidelines : ఆహారమే దివ్య ఔషధం… సరైన ఆహారం తీసుకుంటే.. ఎలాంటి రోగాలూ దరిచేరవని భావిస్తారు. ఎప్పుడు..ఎలా..ఏమి తినాలి… అనేదానిపై మనకు అవగాహన ఉంటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరమే ఉండదు. సరైన ఆహారపు అలవాట్లు ఉంటే.. సంపూర్ణ ఆరోగ్యం ఉంటుంది. ప్రస్తుతం పెరిగిపోతున్న అనేక రకాల అనారోగ్య సమస్యలకు సమతుల్య ఆహారం తీసుకోకపోవడమే కారణం. ఈ విషయం అందరికీ తెలిసినప్పటికీ.. అసలు ఎలాంటి ఆహారం, ఏ సమయంలో, ఎంత మోతాదులో తీసుకోవాలన్నదానిపై అవగాహన ఉండదు. ఈ అవగాహన తెచ్చుకుంటే…జీవితకాలం ఆస్పత్రులకు దూరంగా ఉండొచ్చు. దీనిపై ICMR కొన్ని సూచనలు చేసింది.

ఓ పూట టిఫిన్..రెండు పూట్ల భోజనం… ఉదయం, సాయంత్రం.. కొన్నిసార్లు మధ్యాహ్నం వేళల్లోనూ, ఇష్టమొచ్చిన సమయాల్లో టీ, కాఫీలు, వాటిలో ఇష్టం వచ్చినంత పంచదార, కుదిరినప్పుడు పండ్లు….బజ్జీలు, వడలు వంటి స్నాక్స్, పిజ్జాలు, బర్గర్లు వంటి జంక్‌ఫుడ్.. ఇలా మనకు ఏది నచ్చితే అది తినేస్తూ ఉంటాం. కరోనా తర్వాత డ్రై ఫ్రూట్స్‌ను రోజువారీ ఆహారంలో భాగం చేసుకున్నవారి సంఖ్య బాగా పెరిగింది. అయితే వీటన్నింటి వల్ల ఆకలి, జిహ్వచాపల్యం తీరుతోంది…కానీ శరీరానికి కావాల్సిన పోషకాలు, లవణాలు అందుతున్నాయా…?

Read Also : Garlic Health Benefits : వెల్లుల్లి తింటే కలిగే 8 ఆరోగ్య ప్రయోజనాలివే.. మీ డైట్‌లో తప్పక చేర్చుకోండి!

 ప్రతి పదిమందిలో 8 మందికి ఈ సమస్యలు :
మనం ఆరోగ్యంగా ఉండడానికి కావల్సినంత శక్తి సమకూరుతుందా…? అన్న ప్రశ్నలకు మాత్రం సమాధానాలుండవు. ఏ కూరగాయలు తింటే..ఏ విటమిన్లు అందుతాయి..? ఏ పండ్లలో ఏ పోషకాలు ఉన్నాయి. ఐరన్ పెంచుకోవడానికి ఏం చేయాలి..? విటమిన్ సీ శరీరానికి అందాలంటే రోజు మొత్తంలో ఎప్పుడెప్పుడు నిమ్మజాతి పండ్లు తినాలి..? ఇలాంటి వన్నీ వందలో 90 మందికి తెలియదు. మిగిలిన 10 మందికి తెలిసినా అందుకు తగ్గట్టుగా ఆహారం తీసుకునే సమయం, శ్రద్ధ రెండూ ఉండవు. కానీ ఈ వైఖరే మనల్ని రోగాల బారిన పడేస్తోంది. ఆస్పత్రుల చుట్టూ తిరిగేలా చేస్తోంది.

మనకు రకరకాల ఆహారపదార్థాలు అందుబాటులో ఉంటాయి. అనేకమంది అనేక రకాల సలహాలిస్తుంటారు. చిన్ననాటి నుంచి ఒక్కొక్కరి ఆహారపుటలవాట్లు ఒక్కోలా ఉంటాయి. అయితే శరీరానికి సరిపడా పోషకాలు అందేలా మన రోజువారీ ఆహారం ఉండదన్నది అందరికీ తెలుసు. సాధారణంగా మనం మన అలవాట్లకు తగ్గట్టుగా తింటుంటాం. ఆకలి తీర్చుకోవడానికి తింటాం. చాలా ఎక్కువగా జిహ్వచాపల్యం తీర్చుకోవడానికి ప్రాధాన్యత ఇస్తాం. కానీ..అసలు మనం తినే ఆహారంతో మంచి జరుగుతోందా..?శరీరానికి నష్టం కలుగుతుందా అనేది మాత్రం ఆలోచించం. ఇదే సమాజంలో అనేక రకాల అనారోగ్య సమస్యలను ఇబ్బడిముబ్బడిగా పెంచేస్తోంది. ఒకప్పుడు 45 దాటిన వారిలో ప్రతి పదిమందిలో ఒకరు లేదా ఇద్దరికి షుగర్, బీపీల వంటి సమస్యలు ఉంటే.. ఇప్పుడు ప్రతి పదిమందిలో 8 మందికి ఈ సమస్యలుంటున్నాయి. 30ల్లోనే హైబీపీతో అల్లాడుతున్నారు. 50 ఏళ్లు దాటిన తర్వాత అనారోగ్య సమస్యలు ఊహించని విధంగా చుట్టుముడుతున్నాయి.

మామూలుగా ఎవరి అలవాట్ల గురించైనా చెప్పేటప్పుడు… ఆ వ్యక్తికి టీ, కాఫీ తాగే అలవాటు కూడా లేదు అంటుంటాం. మందు, సిగరెట్ వంటివే కాదు.. టీ, కాఫీ కూడా తాగరు అని చెప్పడం దీని ఉద్దేశం. దీని ప్రకారం మందు, సిగరెట్ స్థాయిలో కాకపోయినా… టీ, కాఫీ వంటివి కూడా ఓ రకమైన దురలవాట్లవంటివే అన్నది సమాజంలో ఉద్దేశం. కానీ ప్రతి పదిమందిలో తొమ్మిది మంది టీ, కాఫీ తాగేవారే ఉంటారు. కాఫీ తాగితే తలనొప్పి పోతుంది. టీ తాగితే మెదడు ఫ్రెష్‌గా మారుతుంది. మనసుకు ఉల్లాసంగా అనిపిస్తుంది అనే కారణాలు ప్రధానంగా వినిపిస్తుంటాయి..

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తీవ్ర హెచ్చరిక :
కానీ నిజానికి టీ, కాఫీతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చాలా తక్కువ. కానీ టీ, కాఫీ లేకుండా మనమంతా బతకలేం. అయితే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం డిన్నర్ తినేఅంత సిస్టమాటిక్‌గా ఉదయం ఓసారి, సాయంత్రమోసారి టీ, కాఫీలు తాగితే ఆరోగ్యానికి పెద్దగా కలిగే నష్టం ఉండదు. కానీ మనం అలా కాదు… అసలు టీ, కాఫీలకు మనకో సమయమంటూ ఉండదు. ఏం తోచకపోతే.. టీ తాగి రిలాక్స్‌ అవుతుంటారు కొందరు. సమయం, సందర్భంతో పని లేకుండా రోజుకు నాలుగైదు సార్లు కాఫీ తాగితే కానీ.. కొందరికి ఏమీ తోచదు. ఇదే వద్దని తీవ్ర హెచ్చరిక చేసింది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్.

టీ, కాఫీలు అత్యధికంగా తాగే దేశాల్లో మనదేశం ముందువరుసలో ఉంటుంది. తలపగలకొట్టుకుపోతోంది.. వెంటనే ఓ టీ తాగాలి అనే మాట ప్రతి భారతీయుడు తమ జీవితకాలంలో ఎన్నిసార్లు వాడతాడో లెక్కలేదు. ఎవరైనా స్నేహితులు, బంధుమిత్రులు ఇంటికి వచ్చిన వెంటనే మనం వారికి అందించేది కూడా టీ లేదా కాఫీనే. దీనికి వేళాపాళలతోనూ పనిలేదు. అలా టీ, కాఫీలు మన జీవితంలో ఓ భాగమైపోయాయి. అయితే ఇంతలా టీ, కాఫీమీద ఆధారపడడం, అవి లేనిదే రోజువారీ జీవితం గడవదని భావించడం సరికాదన్నది ఎప్పటినుంచో ఉన్న అభిప్రాయం.

అలాగే ఎప్పుడు పడితే అప్పుడు టీ తాగడం మంచిది కాదన్న విషయమూ పెద్దవాళ్లు చెబుతూనే ఉంటారు కానీ మనం చెవికెక్కించుకోం. అయితే ఇప్పుడు ICMR కూడా ఇదే హెచ్చరిస్తోంది. టీ, కాఫీలు అసలు తాగొద్దని ICMR చెప్పలేదు కానీ..ఎప్పుడెప్పుడు..ఎంత మేర, ఎలా తాగాలో…ఎప్పుడెప్పుడు అసలు తాగకూడదో….అసలు కాఫీ, టీ వల్ల కలిగే కష్టనష్టాలేమిటో సవివరంగా మార్గదర్శకాల రూపంలో తెలియజేసింది ICMR. టీ, కాఫీల గురించే కాదు..మనం ఆరోగ్యానికి ఎంతో మంచివనుకునే కొబ్బరిబోండాల గురించీ, అలాగే…ఏ ఆహారం తింటే..రోగాలు దరిచేరకుండా ఉంటాయనేదాని గురించి సమగ్ర గైడ్‌లైన్స్ విడుదల చేసింది.

Read Also : World Health Day : మీకు ప్రీ-డయాబెటిస్‌ ఉందని తెలుసా? కంట్రోల్ చేయకుండా వదిలేయవద్దు.. వైద్యుల హెచ్చరిక..!