Herbal Drinks : మంచి నిద్ర కోసం.. ఈ అద్భుతమైన హెర్బల్ డ్రింక్స్ తప్పక ట్రై చేయండి!

నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారా? మంచి నిద్ర కోసం ఈ కింది హెర్బల్ డ్రింక్స్ ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Herbal Drinks : మంచి నిద్ర కోసం.. ఈ అద్భుతమైన హెర్బల్ డ్రింక్స్ తప్పక ట్రై చేయండి!

Herbal Drinks Better Sleep ( Image Credit : pexels )

Herbal Drinks : నిద్రపట్టడం లేదా? మంచి నిద్ర కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేదా? అయితే, కొన్ని హెర్బల్ డ్రింక్స్ తీసుకోవడం ద్వారా మంచి నిద్రను పొందవచ్చు. ప్రతిరోజూ మీ దినచర్యలో భాగం చేసుకోవడం ద్వారా ప్రశాంతత, విశ్రాంతిని పొందవచ్చు. మెరుగైన నిద్రను ప్రోత్సహిస్తాయి. మంచి నిద్ర కోసం ఈ కింది హెర్బల్ డ్రింక్స్ ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Read Also : Stress Physical Health : ఒత్తిడితో హైబీపీ, అజీర్ణం సమస్యలు.. మీ శారీరక ఆరోగ్యంపై ఎంతలా ప్రభావం చూపిస్తుందంటే?

1. లావెండర్ టీ :
లావెండర్ మంచి సువాసనను కలిగి ఉంటుంది. ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో సాయపడుతుంది. నిద్రకు ముందు లావెండర్ టీ తాగడం వల్ల మనస్సు, శరీరానికి విశ్రాంతి లభిస్తుంది. తద్వారా మంచి నిద్ర పడుతుంది. నిద్రకు ఒక గంట ముందు ఈ టీని తీసుకోవడం మంచిది. లావెండర్ టీ కూడా యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంది. జీర్ణ సమస్యలను తగ్గించడంలో అద్భుతంగా సాయపడుతుంది.

2. పిప్పరమింట్ టీ :
పిప్పరమింట్ టీ రిఫ్రెష్‌గా ఉండటమే కాదు.. మీ కండరాలను రిలాక్స్ చేయడంలో సాయపడుతుంది. అలాగే, టెన్షన్‌ను తగ్గించగలదు. తద్వారా మంచి నిద్ర పడుతుంది. నిద్రపోయే ఒక గంట ముందు సాయంత్రం ఈ టీని సేవించడం ఉత్తమం. పిప్పరమింట్ టీ కూడా జీర్ణక్రియకు సాయపడుతుంది. ప్రేగు సిండ్రోమ్ (IBS) లక్షణాలను కూడా తగ్గిస్తుంది.

3. అశ్వగంధ టీ :
అశ్వగంధ అనేది అడాప్టోజెనిక్ హెర్బ్. శరీరంలో ఒత్తిడిని తగ్గించి విశ్రాంతిని కలిగిస్తుంది. కార్టిసాల్ స్థాయిలను తగ్గించే గుణాలను కలిగి ఉంటుంది. ఒత్తిడికి సంబంధించిన హార్మోన్, మంచి నిద్రను ప్రోత్సహిస్తుంది. నిద్రవేళకు ఒక గంట ముందు సాయంత్రం సమయంలో ఈ అశ్వగంధ టీని సేవించడం ఉత్తమం. అశ్వగంధ టీ మానసిక స్థితిని మెరుగుపరచడంలో అద్భుతంగా ఉపయోగపడుతుంది.

4. అల్లం టీ :
అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, డైజెస్టివ్ గుణాలు ఉన్నాయి. కండరాలను రిలాక్స్ చేయడంతో పాటు మంచి నిద్రను ప్రేరేపిస్తుంది. నిద్రించే ముందు అల్లం టీ తాగడం వల్ల అజీర్ణం, ఉబ్బరం తగ్గుతుంది. ప్రశాంతమైన నిద్ర పోవచ్చు. నిద్రకు ఒక గంట ముందు సాయంత్రం ఈ అల్లం టీని సేవించాలి. అల్లం టీ కూడా వికారం తగ్గించడంతో పాటు రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సాయపడుతుంది.

5. పసుపు పాలు :
పాలు, దాల్చినచెక్క, అల్లం వంటి ఇతర సుగంధ ద్రవ్యాలతో పసుపు కలపాలి. అప్పుడు గోల్డెన్ మిల్క్ మాదిరిగా మారుతాయి. పసుపులో కర్కుమిన్ ఉంటుంది. మంచి నిద్రను అందిస్తుంది.ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. నిద్రపోయే ముందు ఈ పసుపు పాలు తాగడం వల్ల వాపు తగ్గుతుంది. నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది. నిద్రించే ఒక గంట ముందు ఈ పసుపు పాలను సేవించడం ఉత్తమం. జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా సాయపడుతుంది.

Read Also : Garlic Health Benefits : వెల్లుల్లి తింటే కలిగే 8 ఆరోగ్య ప్రయోజనాలివే.. మీ డైట్‌లో తప్పక చేర్చుకోండి!

Note : హెర్బల్ రెమెడీస్‌ను పాటించే ముందు వైద్యున్ని సంప్రదించండి. మీలో ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే.. మందులు వాడుతుంటే ఈ హెర్బల్ డ్రింక్స్ వాడకపోవడమే మంచిది. వైద్యుని సలహా మేరకు మాత్రమే వీటిని తీసుకోవాలి.