Summer : వేసవిలో బరువు సులభంగా తగ్గేందుకు ఏంచేయాలంటే!

ఫిట్‌నెస్ వ్యాయామాలు చేస్తున్న సమయంలో తగినంత కేలరీలు, మాక్రోన్యూట్రియెంట్‌లను తీసుకోవడం చాలా ముఖ్యం. మాక్రో, మాక్రోన్యూట్రియెంట్లు కొవ్వు, ప్రోటీన్, పిండి పదార్థాలు, నీరు, ఫైబర్ రూపంలో మీ శరీరానికి పెద్ద పరిమాణంలో అవసరమయ్యే ఆహారాన్ని అందించాలి.

Summer : వేసవిలో బరువు సులభంగా తగ్గేందుకు ఏంచేయాలంటే!

Summer Fitness

Summer : పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా చాలా మంది రోజు వారీ వ్యాయామాలకు సమయం కేటాయించరు. దీంతో తమకున్న ఫిటె నెస్ లక్ష్యాలన్నీ మరుగున పడిపోతాయి. చలికాలంలో చాలికి లేవలేక వ్యాయామాలకు దూరమై శరీర బరువను పెంచుకుంటారు. అయితే వేసవి కాలంలో పెరిగిన బరువును సులభంగా తగ్గించుకునేందుకు అవకాశం ఉన్నప్పటికీ వేసవి ఉష్ణోగ్రతలను సాకుగా చూపించి వ్యాయామాలకు డుమ్మా కొట్టేయటం చాలా మందికి పరిపాటిగా మారిపోయింది. అయితే వేసవి కాలంలో శరీరబరువును సులభంగా తగ్గించుకోవచ్చని ఫిట్ నెస్ నిపుణులు సూచిస్తున్నారు. వేసవిలో ప్రతిరోజూ వ్యాయామం చేయడం వల్ల బీఎంఐ ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, రోగనిరోధక శక్తి బలపడుతుంది. దీర్ఘకాలిక వ్యాధులను కూడా దూరం చేస్తుంది. వేసవి వ్యాయామాలకు అడ్డుకాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుని వ్యాయామాలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని చిట్కాలు పాటిస్తే వేసవిలోనూ ఫిట్​నెస్​ను కాపాడుకోవచ్చు అంటున్నారు. మరి ఆ చిట్కాలేంటో ఇప్పుడు చుద్దాం.

నీరు ఎక్కువగా తీసుకోవాలి; వ్యాయామం చేసే సమయంలో చెమట ఎక్కువగా వస్తుంది. అయితే వేసవి కాలంలో వర్క్​అవుట్స్ చేస్తున్నప్పుడు చెమట మరింత ఎక్కువగా వస్తుంది. ఎక్కువ చెమట బయటకు రావడం వల్ల నీరు, లవణాలు కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి.. నీరు ఎక్కువగా తీసుకుని.. హైడ్రేటెడ్​గా ఉండాలి. తగినంత నీరు తీసుకోకపోవడం వల్ల అలసట, కళ్లు తిరగడం, నోరు, పెదవులు పొడిబారినట్లు అనిపించే అవకాశముంది. నీరు, కొబ్బరి నీరు, నిమ్మకాయ నీరు,గంజి వంటి దేశీయ వేసవి పానీయాలు హైడ్రేట్ గా ఉంచుకోవడానికి తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. చక్కెర తక్కువగా ఉండే పానీయాలు తీసుకోవటం ఆరోగ్యానికి చాలా మంచిది. వేసవి పుచ్చకాయలు విరివిగా లభిస్తాయి. రుచితోపాటు దాహాన్ని తీర్చడంలో తోడ్పడతాయి. పుచ్చకాయల్లో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి.

పోషకాహారంపై శ్రద్ధ ; ఫిట్‌నెస్ వ్యాయామాలు చేస్తున్న సమయంలో తగినంత కేలరీలు, మాక్రోన్యూట్రియెంట్‌లను తీసుకోవడం చాలా ముఖ్యం. మాక్రో, మాక్రోన్యూట్రియెంట్లు కొవ్వు, ప్రోటీన్, పిండి పదార్థాలు, నీరు, ఫైబర్ రూపంలో మీ శరీరానికి పెద్ద పరిమాణంలో అవసరమయ్యే ఆహారాన్ని అందించాలి. ఇవి శరీరానికి ఎంతో బలాన్ని అందిస్తాయి. వర్క్ అవుట్స్ చేసే సమయంలో ఈ ఆహారం శక్తిగా ఉపకరిస్తుంది. తద్వారా అలసట రాకుండా ఉపయోగపడుతుంది. వేసవి కాలంలో కూరగాయలతో కూడిన ఆహారాన్ని తీసుకోవటం మంచిది. వీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. వీటిని రోజువారీ ఆహారంలో ఎక్కువగా చేర్చుకోవడం వల్ల త్వరగా బరువు తగ్గవచ్చు. దోసకాయ, పొట్లకాయ, వంకాయ, బెండకాయ వంటి కూరగాయలు చాలా ఆరోగ్యకరమైనవి. బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తాయి. వేసవిలో మజ్జిగ రూపంలో పెరుగును ఎక్కువగా తీసుకోవటం మంచిది. ఇది జీర్ణ ఆరోగ్యాన్ని పెంపొందించడానికి తోడ్పడుతుంది వేసవిలో ఇలాచేయటం వల్ల సులభంగా బరువు తగ్గవచ్చు. వేసవిలో మీ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి మీ ఆహారంలో ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.

బరువులు ఎత్తడం; కొన్ని రకాల వ్యాయామాలు బరువును తగ్గించటంలో బాగా తోడ్పడతాయి. అలాంటి వాటిలో బరువులు ఎత్తటం అనేది కూడా ఒకటి. బరువులు ఎత్తడమనేది మీ ఫిట్‌నెస్ లక్ష్యాలను సాధించడంలో బాగా సహాయపడుతుంది. ప్రతి కండరానికి వ్యాయామం అయ్యేలా ప్రణాళిక ప్రకారం వ్యవహరించాలి. ఉదయం, సాయంత్రం వేళల్లో నడక, తేలిక పాటి జాగింగ్, స్విమ్మింగ్, వంటివి శరీర బరువును తగ్గించేందుకు దోహదపడతాయి. వీటిని సరైన శిక్షకుడి పర్యవేక్షకుడి పర్యవేక్షణలో చేయటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.