Turmeric : పసుపు తీసుకునే విషయంలో ఎవరు జాగ్రత్తగా ఉండాలంటే?

మధుమేహంతో బాధపడేవారు పసుపును పరిమితంగా తీసుకోవాలి. చక్కెర వ్యాధిగ్రస్తుల రక్తంలో చక్కెరను నియంత్రించడానికి మందులువాడే వారు, రక్తాన్ని పలుచన చేసే మందులు తీసుకునేవారు పసుపును అధికంగా

Turmeric : పసుపు తీసుకునే విషయంలో ఎవరు జాగ్రత్తగా ఉండాలంటే?

Turmaric

Turmeric : విస్తృతంగా వాడబడే ఆరోగ్యకరమైన పదార్ధాలలో పసుపు ఒకటి. పసుపు వల్ల కలిగే ప్రయోజనాలు అధికం. పసుపులోని అత్యంత శక్తివంతమైన భాగం కర్కుమిన్ కీళ్ల నొప్పులు, డయాబెటిస్ , అల్జీమర్స్ చికిత్సలలో ఉపయోగపడుతుంది. కానీ మన ఆరోగ్యంపై దాని ప్రతికూల ప్రభావాల గురించి చాలా తక్కువ తెలుసు. పసుపును పురాతన కాలం నుంచి ఆయుర్వేద చికిత్సలో ఉపయోగిస్తున్నారు. పసుపు గాయాలను తగ్గించే గుణం ఉంది. సౌందర్య ఉత్పత్తులలో వాడతారు, చర్మ సౌందర్యానికి పరమ ఔషధంగా చెప్పవచ్చు.

పసుపులో B6, C, కాల్షియం, సోడియం, ప్రోటీన్, జింక్, డైటరీ ఫైబర్, మాంగనీస్ మరియు పొటాషియం వంటి అనేక విటమిన్లు ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనం కలిగిస్తాయి. పసుపులో ముఖ్యమైన మూలకం అయిన కుర్కుమిన్, దానిని ఆరోగ్యంగా మార్చడంలో దోహదపడుతుంది. కానీ అధికంగా తీసుకుంటే హాని కలుగుతుంది. కొన్ని రకాల వ్యాధులతో బాధపడుతున్నవారు పసుపును తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాలి. అలాకాకుండా అధిక మోతాదులో తీసుకుంటే ఆరోగ్యపరమైన చిక్కులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పిత్తాశయంలో రాళ్లతో బాధపడేవారు పసుపును తీసుకునే విషయంలో జాగ్రత్త తప్పనిసరి ఎందుకంటే దీని వల్ల రాళ్ల సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశాలు ఉంటాయి. వైద్యులు సూచించిన మోతాదులో మాత్రమే వీటిని ఆహారంలో బాగం చేసుకోవటం మంచిది. కాలేయ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు పసుపు తినకూడదు. వారు వ్యాధి నుండి కోలుకున్న తర్వాత వైద్యుని సలహా తీసుకుని దానిని వినియోగించాలి.

మధుమేహంతో బాధపడేవారు పసుపును పరిమితంగా తీసుకోవాలి. చక్కెర వ్యాధిగ్రస్తుల రక్తంలో చక్కెరను నియంత్రించడానికి మందులువాడే వారు, రక్తాన్ని పలుచన చేసే మందులు తీసుకునేవారు పసుపును అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో రక్తపరిమాణం తగ్గే అవకాశం ఉంటుంది.

ముక్కు నుండి తరచూ రక్తం వచ్చే వారు పసుపును ఎక్కువగా తీసుకుంటే పరిస్థితి మరింత ఝటిలంగా మారవచ్చు. కాబట్టి ముక్కు నుండి రక్తస్రావంతో బాధపడేవారు పసుపును తక్కువ మోతాదులో మాత్రమే తీసుకోవాలి. ఒక రోజులో పసుపు ఎంత మోతాదులో తీసుకోవాలనే విషయానికి వస్తే రోజు మొత్తం ఒక టీస్పూన్ పసుపు తీసుకుంటే సరిపోతుంది.