Rashes And Itching : చిన్నారుల్లో దద్దుర్లు, దురద సమస్య ఎందువల్ల?

వైరల్, ఫంగల్, బ్యాక్టీరియల్ ఇన్ ఫెక్షన్లు ఉన్న సందర్భంలో సైతం చర్మంపై దద్దుర్లు ఏర్పడతాయి. రక్తంలో ఇన్ ఫెక్షన్ ఉన్నా ఈ సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది. వైరల్ ఇన్ ఫెక్షన్ వల్ల దద్దుర్లు వస్తే చిన్నారులకు జ్వరం కూడా వస్తుంది. హెర్పిస్ వైరల్ ఇన్ ఫెక్షన్స్ వచ్చిన సందర్భంలో చర్మంపై దద్దుర్లు వస్తాయి.

Rashes And Itching : చిన్నారుల్లో దద్దుర్లు, దురద సమస్య ఎందువల్ల?

Rashes And Itching : పసిపిల్లల్లో చర్మంపై ఎర్రటి దద్దుర్లు రావటం, అవి వచ్చిన చోట దురద సమస్య ఉండటం మనం చూస్తూనే ఉంటాం. ఇలాంటి పరిస్ధితి తలెత్తినప్పుడు చిన్నారులు చికాకుతో విపరీతంగా ఎడవటం వంటివి చేస్తుంటారు. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. పసిపిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించటం అవసరం. ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించిన వివిధ రకాల సమస్యలు వారిని చుట్టుముడతాయి.

ముఖ్యంగా పరిశుభ్రత విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు. చిన్నారులకు ఉపయోగించే పొత్తిగుడ్డలు, పక్క బట్టలు, వారు వేసుకునే దుస్తులను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. ఒక వేళ ఏమాత్రం శుభ్రపర్చకుండా పదేపదే వాడిని బట్టలనే వాడటం వల్ల చర్మ సంబంధిత ఇన్ ఫెక్షన్లు వచ్చేందుకు ఆస్కారం ఉంటుంది. చిన్నారులకు ఉపయోగించిన డైపర్స్ ను మారుస్తూ ఉండాలి.లేకపోతే చర్మంపై రాషెస్ వచ్చే అవకాశం ఉంటుంది.

అదే సమయంలో వైరల్, ఫంగల్, బ్యాక్టీరియల్ ఇన్ ఫెక్షన్లు ఉన్న సందర్భంలో సైతం చర్మంపై దద్దుర్లు ఏర్పడతాయి. రక్తంలో ఇన్ ఫెక్షన్ ఉన్నా ఈ సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది. వైరల్ ఇన్ ఫెక్షన్ వల్ల దద్దుర్లు వస్తే చిన్నారులకు జ్వరం కూడా వస్తుంది. హెర్పిస్ వైరల్ ఇన్ ఫెక్షన్స్ వచ్చిన సందర్భంలో చర్మంపై దద్దుర్లు వస్తాయి. ఆటోఇమ్యూన్ వ్యాధులు ,కొన్ని రకాల మందులు కూడా దద్దుర్లు, అలర్జీకి కారణం అయ్యే అవకాశాలు లేకపోలేదు.

రాషెస్ సమస్యతో బాధపడుతున్న చిన్నారుల విషయంలో జాగ్రత్తలు పాటించటం అవసరం. వారికి వేసే దుస్తులను కాటన్ దుస్తులు, వదులుగా, మెత్తగా ఉండే వాటిని ఉపయోగించాలి. ఉన్ని దుస్లులు వేయరాదు. స్నానానికి గ్లిజరిన్ సబ్బులను మాత్రమే వాడాలి. సబ్బులను ఎక్కువగా వాడకపోవటమే మంచిది.