Banana : రోజుకో అరటిపండుతో…గుండె, కిడ్నీ సమస్యలకు చెక్

కిడ్నీల ఆరోగ్యానికి అరటి పండు నిజంగా చేసే మేలు అంతా ఇంతా కాదు. అలానే ఫ్రీరాడికల్స్ వల్ల కలిగే నష్టాలు తగ్గించడానికి కూడా అరటి పండు బాగా ఉపయోగ పడుతుంది.

Banana : రోజుకో అరటిపండుతో…గుండె, కిడ్నీ సమస్యలకు చెక్

Banana

Banana : అన్ని కాలాల్లో లభించే పండు అరటి పండు . ఈ పండును అందరూ ఇష్టంగా తింటారు. రోజు ఒక ఆపిల్ తింటే మనిషికి డాక్టర్ అవసరం ఉండదని ఎలాచెప్పవచ్చో రోజుకో అరటి పండు తిన్నా అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉండదంటున్నారు పరిశోధకులు. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న జబ్బుల్లో హార్ట్ ఎటాక్ ఒకటి. హార్ట్ ఎటాక్ రావడం ప్రస్తుత రోజుల్లో సర్వసాధారణంగా మారిపోయింది. కొన్నేండ్ల కింద వరకు కేవలం వృద్ధులు, ఊబకాయులకు గుండెపోటు వచ్చేది. అయితే, ఇప్పుడు మారిన జీవనశైలితో యువకుల్లో కూడా గుండెజబ్బులు కనిపిస్తున్నాయి. గుండె జబ్బుల నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు నిత్యం ఒక అరటి పండు తినడం అలవాటు చేసుకోవడం మంచిదంటున్నారు ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు.

ప్రతిరోజు అరటిపండు తినడం అలవాటు చేసుకోవడం ద్వారా గుండెపోటుతో మరణించే ప్రమాదాన్ని మూడో వంతు తగ్గించవచ్చని పరిశోధకులు చెప్తున్నారు. దీనిలో ఉండే పొటాషియం ధమనులు మూసుకుపోకుండా చూస్తుంది. అలబామా యూనివర్సిటీ పరిశోధన ప్రకారం, అరటిపండ్లు తినడం వల్ల గుండెపోటు, స్ట్రోక్స్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. నిత్యం మీడియం సైజ్ అరటి పండు ఒకటి తినడం వల్ల శరీరానికి 9 శాతం పొటాషియం అందుతుంది. అరటి పండు తినడం వల్ల రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. హృదయనాళ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఇందులో షుగర్ తక్కువ ఉండడంతోపాటు అధిక మోతాదు లో స్టార్చ్ ఉంటుంది. ప్రోబయోటిక్స్ కంపౌండ్స్ కూడా ఉంటాయి.

కిడ్నీల ఆరోగ్యానికి అరటి పండు నిజంగా చేసే మేలు అంతా ఇంతా కాదు. అలానే ఫ్రీరాడికల్స్ వల్ల కలిగే నష్టాలు తగ్గించడానికి కూడా అరటి పండు బాగా ఉపయోగ పడుతుంది. వీటిని కూడా తగ్గించడానికి అరటి పండ్లు బాగా ఉపయోగ పడుతుంది. కాన్సర్ తో కూడా అరటి పండు లో ఉండే ఫైబర్ పొటాషియం పోరాడుతాయి.మిగతా పండ్లలో కంటె ఎక్కవ పోషకాలు అరటి పండులో లభిస్తాయి. అరటిపండ్లలో విటమిన్లు, ఐరన్, ఫైబర్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు మొదలైనవి ఉంటాయి. శక్తికి మంచి ప్రత్యామ్నాయంగా కూడా వైద్యులు సూచిస్తుంటారు.

దీనిలో విటమిన్ సి కూడా ఉంటుంది. అలాగే కళ్ల చుట్టూ ఉండే నల్లటి వలయాలను కూడా ఇది పోగొడుతుంది. మొటిమలు, మచ్చలను కూడా తగ్గించుకో వచ్చు. అరటి పండ్లు తీసుకోవడం వల్ల రక్తపోటు, రక్తహీనత సమస్యలు కూడా దూరమవుతాయి. అరటి పండ్లు తీసుకోవడం వల్ల మల బద్ధకం కూడా తగ్గి పోతుంది. డిప్రెషన్ ని కూడా అరటి పండు తగ్గిస్తుంది. గర్భిణీలు అరటి పండ్లు తీసుకోవడం చాలా మేలు. అరటి పండు లో శరీరానికి అవసరమయ్యే మాంగనీస్ 13 శాతం ఉంటుంది. అరటిపండు లో ఉండే మృదుత్వం వల్ల పేగులకు ఎలాంటి నష్టం కలిగించదు.

అల్సర్ కారక యాసిడ్ లను ఉత్పత్తి చేయకుండా అరటి పండు నిరోధిస్తుంది. 100 గ్రాముల అరటి పండు లో జీరో శాతం కొవ్వు ఉంటుంది. అలానే విటమిన్ బి 6 పొటాషియమ్, ఫైబర్ ఇలా మంచి న్యూట్రియన్స్ తో ఇది ఉంటుంది. రాత్రి పూట మాత్రం అరటి పండ్లు తీసుకోకండి. అది మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాత్రి పూట అరటి పండు తినే అలవాటు ఉంటే మానుకోవడం మంచిది.