NTR : 19 ఏళ్ళ వయసులో ఎన్టీఆర్ సృష్టించిన రికార్డుకి 19 ఏళ్ళు..

జూనియర్ ఎన్టీఆర్ సరిగా మీసాలు రాని వయసులోనే రికార్డులను సృష్టించి అప్పటి స్టార్ హీరోలకు సైతం చెమటలు పట్టించాడు. ఆది, సింహాద్రి లాంటి సినిమాలతో పెద్ద హీరోల సినిమాల కలెక్షన్స్ కూడా తలదన్నేలా..

NTR : 19 ఏళ్ళ వయసులో ఎన్టీఆర్ సృష్టించిన రికార్డుకి 19 ఏళ్ళు..

19 years for NTR Andhrawala

NTR : జూనియర్ ఎన్టీఆర్ సరిగా మీసాలు రాని వయసులోనే రికార్డులను సృష్టించి అప్పటి స్టార్ హీరోలకు సైతం చెమటలు పట్టించాడు. ఆది, సింహాద్రి లాంటి సినిమాలతో పెద్ద హీరోల సినిమాల కలెక్షన్స్ కూడా తలదన్నేలా, తన సత్తా ఏంటో చూపించాడు. నూనూగు మీసాలు వయసులోనే నటనలో ఎన్టీఆర్ మెచ్యూరిటీ చూసి ప్రేక్షకులతో పాటు, సినీ ప్రముఖుల కూడా ఆశ్చర్యపోయారు.

NTR : సాయి ధరమ్ తేజ్ కోసం ఎన్టీఆర్ మాట సాయం..

ఇక సింహాద్రి వంటి ఇండస్ట్రీ హిట్ కొట్టిన తరువాత ఎన్టీఆర్ నుంచి వచ్చిన సినిమా ‘ఆంధ్రావాలా’. మాస్ డైరెక్టర్ పూరీజగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు ముందు ఎంతో క్రేజ్ ని సంపాదించుకుంది. ఈ సినిమా ఆడియో లాంచ్ ఫంక్షన్ ని సీనియర్ ఎన్టీఆర్ స్వస్థలమైన నిమ్మకూరులో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రము నలుమూల నుంచి ఫ్యాన్స్ వచ్చేందుకు.. 10 రైళ్లు, వేలల్లో బస్సులు అప్పటి ప్రభుత్వం కేటాయించిన, లక్షలలో వస్తున్న జనాలకు సరిపోలేదు.

సుమారు 12km దూరంలో ఉన్న గుడివాడలో ఫ్లైట్ దిగిన ఎన్టీఆర్ ఆడియో లాంచ్ ప్రాగణానికి రావడానికి దాదాపు 6 గంటలుపైగా సమయం పట్టింది అంటే అర్ధం చేసుకోండి. అప్పటి ఆ జనసంద్రాన్ని చూసి రాజకీయ నాయకుల వెన్నులో కూడా వణుకు పుట్టింది అంటే అతిశయోక్తి కాదు. 19 ఏళ్ళ వయసులో ఎన్టీఆర్ సృష్టించిన ఆ రికార్డు ఇప్పటికి 19 ఏళ్ళు పూర్తీ చేసుకుంది. సినీ చరిత్రలో ఈ రికార్డు అదే మొదటిసారి, అదే చివరిసారి కూడా అంటారు తారక్ అభిమానులు.