OMG2 Trailer : ఓ మై గాడ్ 2 ట్రైలర్ రిలీజ్.. అక్షయ్ శివుడి పాత్ర చేయడం లేదు.. సెన్సార్ బోర్డు ఆదేశం..

అక్షయ్ కుమార్ OMG2 ట్రైలర్ ఎట్టకేలకు ఆడియన్స్ ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాలో అక్షయ్ శివుడి పాత్రలో..

OMG2 Trailer : ఓ మై గాడ్ 2 ట్రైలర్ రిలీజ్.. అక్షయ్ శివుడి పాత్ర చేయడం లేదు.. సెన్సార్ బోర్డు ఆదేశం..

Akshay Kumar Pankaj Tripathi Yami Gautam OMG2 Trailer released

OMG2 Trailer : అక్షయ్ కుమార్ (Akshay Kumar), పరేష్ రావల్ ప్రధాన పాత్రల్లో 2012 లో ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమా OMG (Oh My God). దేవుడిని నమ్మని పరేష్ కోర్టులో దేవుడి మీద కేసు వేయడం, తనకి రక్షణగా శ్రీకృష్ణుడు అక్షయ్ గా రావడం.. అనే ఒక సెటైరికల్ స్టోరీతో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఆ సినిమా అప్పటిలో పలు విమర్శలు ఎదురుకున్నప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం మంచి విజయం అందుకుంది. ఈ చిత్రాన్ని టాలీవుడ్ లో వెంకటేష్ అండ్ పవన్ కళ్యాణ్.. ‘గోపాల గోపాల’గా రీమేక్ కూడా చేశారు.

Naga Chaitanya : శ్రీకాకుళం జిల్లా మత్స్యకారుడు జీవితం ఆధారంగా నాగచైతన్య సినిమా.. వేటకెల్లి పాక్ కోస్ట్ గార్డ్‌కి చిక్కి..

ఇక ఆ మూవీ సూపర్ హిట్ అవ్వడంతో.. ఇప్పుడు దానికి సీక్వెల్ తీసుకు వస్తున్నారు. ఆగష్టు 11న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. దీంతో ఈ మూవీ ట్రైలర్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు మేకర్స్. ఈ సీక్వెల్ లో అక్షయ్ శివుడిగా కనిపించబోతున్నాడని ముందు నుంచి వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ట్రైలర్ మాత్రం అక్షయ్ శివుడి పంపించిన ‘దేవుని దూత’గా కనిపించబోతున్నాడు. ఇటీవల ఆదిపురుష్ (Adipurush), ‘ఓపెన్‌హైమర్’ (Oppenheimer) విషయంలో సెన్సార్ బోర్డు అనేక విమర్శలు ఎదురుకుంది.

Bro Movie : ‘కాంబాబు రాసలీలలు’ మూవీ పోస్టర్ రిలీజ్.. సంజన, సుకన్య క్యాప్షన్.. త్వరలో గంటా, అరగంట..!

దీంతో ఈ మూవీ విషయంలో అనేక జాగ్రత్తలు వహిస్తూ.. దాదాపు 27 సన్నివేశాలకు కత్తెర్లు వేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే అక్షయ్ శివుడిగా కనిపించడం పై కూడా అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. అందుకనే శివుడి పాత్రని కాస్త శివుని దూత పాత్రగా మార్చినట్లు తెలుస్తుంది. అంతేకాదు ఈ మూవీకి ‘A’ సర్టిఫికెట్ ఇవ్వడం గమనార్హం. ఒక దేవుడి సినిమాకి ఇలా A సర్టిఫికెట్ రావడం మూవీ పై కొంత వ్యతిరేకతని క్రియేట్ చేస్తుంది. కాగా ఈ సినిమాలో పంకజ్ త్రిపాఠి, యామీ గౌతమ్, ‘రామాయణ్’ ఫేమ్ అరుణ్ గోవిల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.