Allu Arjun CocaCola Ad : మేము ఆగము అంటున్న బన్నీ.. కొరియన్ గర్ల్స్ తో కలిసి కోకాకోలా యాడ్..

 పుష్ప సినిమా తర్వాత బన్నీ క్రేజ్ వేరే లెవెల్ కి వెళ్ళింది. ఈ సినిమా తర్వాత బన్నీకి వరుస యాడ్స్ కూడా వస్తున్నాయి. తాజాగా మరో యాడ్ తో ముందుకొచ్చాడు బన్నీ. ఫేమస్ కూల్ డ్రింక్ బ్రాండ్ కోకాకోలా యాడ్ లో అల్లు అర్జున్ నటించాడు. అయితే ఈ యాడ్ ని ఒక సాంగ్ రూపంలో...............

Allu Arjun CocaCola Ad : మేము ఆగము అంటున్న బన్నీ.. కొరియన్ గర్ల్స్ తో కలిసి కోకాకోలా యాడ్..

alluarjun coke ad

Updated On : August 23, 2022 / 10:06 AM IST

Allu Arjun CocaCola Ad :  పుష్ప సినిమా తర్వాత బన్నీ క్రేజ్ వేరే లెవెల్ కి వెళ్ళింది. ఈ సినిమా తర్వాత బన్నీకి వరుస యాడ్స్ కూడా వస్తున్నాయి. తాజాగా మరో యాడ్ తో ముందుకొచ్చాడు బన్నీ. ఫేమస్ కూల్ డ్రింక్ బ్రాండ్ కోకాకోలా యాడ్ లో అల్లు అర్జున్ నటించాడు. అయితే ఈ యాడ్ ని ఒక సాంగ్ రూపంలో తీశారు.

ఈ సాంగ్ ని బుట్టబొమ్మ సాంగ్ పాడిన అర్మాన్ మాలిక్ పాడగా ఇందులో అల్లు అర్జున్ తో పాటు అర్మాన్ కూడా నటించాడు. అంతే కాక కొరియన్ ఫేమస్ మోడల్, యాక్టర్ ట్రిబె కూడా అల్లు అర్జున్ తో కలిసి స్టెప్స్ వేసింది. మరికొంతమంది కొరియన్ గర్ల్స్ కూడా స్టెప్పులు వేశారు. మేము ఆగము అనే ఈ కోకా కోలా యాడ్ సాంగ్ అంతర్జాతీయ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో కలిపి పాడారు. ఇందులో అల్లు అర్జున్ తన స్టైల్ డ్యాన్స్ తో అలరించారు. చివర్లో పుష్ప సినిమా స్టెప్స్ తో అదరగోట్టారు.

LinguSamy : కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ కి జైలుశిక్ష.. మొన్నే రామ్‌తో ‘ది వారియర్’.. అంతలోనే ఇలా..

మొత్తానికి అల్లు అర్జున్ తో ఇలా కోకా కోలా యాడ్ చేయడంతో బన్నీ క్రేజ్ విదేశాల్లో కూడా మరింత పెరగనుంది. ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్, సోషల్ మీడియాల్లో ట్రెండింగ్ లో ఉంది. ఈ కోకాకోలా సాంగ్ చూసి బన్నీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.