Allu Arjun : టాలీవుడ్ నుంచి ఆ అవార్డు అందుకున్న మొదటి నటుడు అల్లు అర్జున్..

టాలీవుడ్ స్టైలిష్ స్టార్‌ని, ఐకాన్ స్టార్‌గా మార్చేసిన సినిమా 'పుష్ప'. ఈ సినిమాతో అల్లు అర్జున్.. పాన్ ఇండియా లెవెల్ లోనే కాదు ఇంటర్నేషనల్ లెవెల్ లోను క్రేజ్ ని సంపాదించుకున్నాడు. కాగా సెంట్రల్ లండన్ లో ఒక మ్యాగజైన్ నిర్వహించే...

Allu Arjun : టాలీవుడ్ నుంచి ఆ అవార్డు అందుకున్న మొదటి నటుడు అల్లు అర్జున్..

Allu Arjun Recieving GQ Leading Man of the Year Award

Updated On : December 15, 2022 / 8:06 AM IST

Allu Arjun : టాలీవుడ్ స్టైలిష్ స్టార్‌ని, ఐకాన్ స్టార్‌గా మార్చేసిన సినిమా ‘పుష్ప’. తన కెరీర్ లో మొదటి హిట్ అందించిన సుకుమార్ తో కలిసి మూడో చిత్రంగా ఈ సినిమాను తెరకెక్కించాడు అల్లు అర్జున్. ఒక రీజనల్ సినిమాగా విడుదలైన ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్ లో ఆకట్టుకోగలదా అని అందరితో పాటు దర్శకుడు సుకుమార్ కూడా అభిప్రాయపడ్డాడు. కానీ ఎవరి ఊహకు అందనంతగా హిట్టుని అందుకొని అందర్నీ ఆశ్చర్యపరిచింది.

Allu Arjun: అప్పుడు చరణ్.. ఇప్పుడు బన్నీ.. ఆ డైరెక్టర్‌కు నో చెప్పారట!

ఈ సినిమాతో అల్లు అర్జున్.. పాన్ ఇండియా లెవెల్ లోనే కాదు ఇంటర్నేషనల్ లెవెల్ లోను క్రేజ్ ని సంపాదించుకున్నాడు. కాగా సెంట్రల్ లండన్ లో ఒక మ్యాగజైన్ నిర్వహించే ‘జెంటిల్‌మెన్స్ క్వార్టర్లీ’ అవార్డ్స్ లో అల్లు అర్జున్.. 2022 గాను ‘GQ లీడింగ్ మ్యాన్ అఫ్ ది ఇయర్’ అవార్డుని అందుకున్నాడు. ఈ అవార్డుని అందించడానికి GQ టీమ్ మొత్తం హైదరాబాద్ వచ్చారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ తాజ్ ఫలక్నుమా ప్యాలస్ లో ఒక పార్టీ నిర్వహించి, అల్లు అర్జున్ కి అవార్డుని అందించారు.

సాధారణంగా ఈ అవార్డుని ఎక్కువుగా బాలీవుడ్ స్టార్స్ కి ఇస్తారు. గతంలో ఈ అవార్డుని దీపికా, రణ్‌వీర్, విక్కీ కౌశల్, కార్తీక్ ఆర్యన్ అందుకున్నారు. అయితే టాలీవుడ్ నుంచి ఈ అవార్డుని అందుకున్న మొదటి నటుడు మాత్రం అల్లు అర్జున్. ఇక అవార్డుని అందుకున్న ఐకాన్ స్టార్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కృతజ్ఞతలు తెలియజేస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. పుష్ప-1 తోనే ఇంతటి క్రేజ్ ని సంపాదించుకున్న అల్లు అర్జున్.. పుష్ప-2 తో ఇంకెంత ఎత్తుకి ఎదుగుతాడో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Allu Arjun (@alluarjunonline)