Thalaivar170 : ముంబై షెడ్యూల్ పూర్తి.. ఒకే ఫ్రేమ్‌లో రజిని, అమితాబ్.. పోస్ట్ వైరల్..

రజినీకాంత్, అమితాబ్ బచ్చన్ కలిసి నటిస్తున్న 'త‌లైవర్ 170' ఇటీవలే ముంబై షెడ్యూల్ మొదలు పెట్టుకుంది. తాజాగా ఆ షెడ్యూల్ కి సంబంధించి..

Thalaivar170 : ముంబై షెడ్యూల్ పూర్తి.. ఒకే ఫ్రేమ్‌లో రజిని, అమితాబ్.. పోస్ట్ వైరల్..

Amitabh Bachchan Rajinikanth Thalaivar170 mumbai schedule complete

Updated On : October 29, 2023 / 2:56 PM IST

Thalaivar170 : జైలర్ వంటి సూపర్ హిట్టు అందుకున్న రజినీకాంత్.. ‘జై భీమ్‌’ డైరెక్టర్ టి.జె.జ్ఞానవేల్ తో తెరకెక్కిస్తున్న సినిమా ‘త‌లైవర్ 170’. లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, ఫహద్‌ ఫాజిల్‌, రానా, మంజు వారియర్‌, రితికా సింగ్‌, దసరా విజయన్‌, రక్షన్ లు వంటి భారీ తారాగణం కనిపించబోతుంది. ఆల్రెడీ షూటింగ్ మొదలుపెట్టుకున్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటూ ముందుకు వెళ్తుంది.

ఇటీవలే చిత్ర యూనిట్ ముంబై షెడ్యూల్ ని ప్రారంభించారు. సినిమాలో రజినీకాంత్, అమితాబ్ బచ్చన్ పై వచ్చే కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. ఈ షెడ్యూల్ షూటింగ్ ని నేటితో పూర్తి చేసేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర నిర్మాతలు ఒక ఫోటోని షేర్ చేశారు. ఆ పిక్ లో అమితాబ్ తన ఫోన్ రజినీకి ఏదో చూపిస్తూ కనిపిస్తున్నారు. ఇక ఇద్దరి లెజెండ్స్ ని ఒక ఫొటోలో చూస్తూనే ఇంతటి కిక్ వస్తుంటే.. బిగ్ స్క్రీన్ పై సినిమాలో చూస్తుంటే ఇంకెంతటి కిక్ వస్తుందో అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Also read : Varun Lavanya : వరుణ్ లావణ్య పెళ్లి వేడుకల షెడ్యూల్ ఇదే.. ఏ రోజు ఏ కార్యక్రమం అంటే?

కాగా రజిని అండ్ అమితాబ్ 33 ఏళ్ళ తరువాత మళ్ళీ ఇప్పుడే కలిసి నటిస్తున్నారు. గతంలో 1980లలో అంధాకా నూన్, గిరాఫ్తార్ వంటి బాలీవుడ్ సినిమాల్లో క‌లిసి న‌టించారు. ఆ తరువాత 1991లో రిలీజైన ముకుల్ ఎస్ ఆనంద్ యొక్క ‘హమ్’ కలిసి నటించిన వీరిద్దరూ.. మళ్ళీ మరోసారి ఒకే ఫ్రేమ్ లో కనిపించలేదు. ఇప్పుడు ఇన్నాళ్ల తరువాత మళ్ళీ ఈ ఇద్దరు లెజెండ్స్ ఓకే ఫ్రేమ్ లో కనిపిస్తుండడంతో మూవీ పై ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి అనిరుద్ ర‌విచంద్ర‌న్ సంగీతం అందిస్తున్నాడు.