Annaatthe: టైటిల్ కన్ఫర్మ్.. ‘పెద్దన్న’గా తలైవర్!

సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘అన్నాత్తే’. ఈ సినిమాకు ఇప్పటికే క్రేజ్ ఉండగా.. వింటేజ్ రజనీని మళ్లీ చూడబొతున్నారన్న టాక్ వుంది. దీపావళి..

Annaatthe: టైటిల్ కన్ఫర్మ్.. ‘పెద్దన్న’గా తలైవర్!

Annaatthe

Annaatthe: సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘అన్నాత్తే’. ఈ సినిమాకు ఇప్పటికే క్రేజ్ ఉండగా.. వింటేజ్ రజనీని మళ్లీ చూడబొతున్నారన్న టాక్ వుంది. దీపావళి సందర్భంగా నవంబర్ 4న సినిమా విడుదలకు సన్నద్ధమవుటుండగా.. ద‌స‌రా సంద‌ర్భంగా విడుద‌లైన టీజ‌ర్ ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ కోణంలో ర‌జ‌నీకాంత్ హీరోయిజాన్ని ఎలివేట్ చేసింది.

Prabhas: ఫ్యాన్స్‌కు ప్రభాస్ సర్‌ప్రైజ్.. స్పిరిట్ కోసం కొత్త గెటప్!

అయితే.. తెలుగులో ఈ సినిమాను ఏ టైటిల్‌తో విడుద‌ల చేస్తారోన‌ని సూప‌ర్‌స్టార్ ఫ్యాన్స్‌లో ఆస‌క్తి నెల‌కొనగా అందుకు తగ్గట్లే మేకర్స్ తెలుగు టైటిల్ ను ఫిక్స్ చేశారు. ‘పెద్ద‌న్న‌’ పేరుతో అన్నాత్తే తెలుగులో విడుద‌లకానుంది. దీనికి సంబంధించిన తెలుగు పోస్ట‌ర్ కూడా విడుదల చేయగా ఇప్పుడు ఈ పోస్టర్ సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

Dussehra Telugu Films: థియేటర్‌లలో మొదలైన బ్యాచిలర్ పెళ్లి సందడి!

దర్శకుడు శివ తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగులో మంచి ధరకు అమ్ముడుపోగా దసరా కానుకగా తెలుగు టైటిల్ ని రివీల్ చేసుకుంది. ఈ సినిమా తెలుగు హక్కులను నారాయణ దాస్ నారంగ్, దగ్గుబాటి సురేష్ బాబు కలిపి 12 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. ఇక సన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహించిన ఈ చిత్రం అటు తమిళ్ తో పాటు తెలుగులో కూడా వచ్చే నవంబర్ 4న దీపావళి కానుకగా భారీ లెవెల్లో రిలీజ్ కానుంది.

Big Boss 5: అర్ధరాత్రి మానస్ దుప్పట్లో పింకీ.. బీబీ హౌస్‌లో మూడుముక్కలాట!

ఈ సినిమాలో రజనీ సవతి సోదరిగా కీర్తి సురేష్ నటిస్తుండగా అన్నాచెల్లెళ్ల అనుబంధం బ్యాక్ డ్రాప్ లో తయారైన కథ కావడంతో టైటిల్ ను కూడా తెలుగుకు తగ్గట్లే పెద్దన్నగా ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. అదే సమయంలో రజనీ మార్క్ యాక్షన్ సన్నివేశాలను పుష్కలంగా ఉండేలా చూసుకోవడంతో రజనీ మళ్ళీ కమ్ బ్యాక్ అవుతాడని ఫ్యాన్స్ ఆశగా ఉన్నారు.