Butterfly : మార్కెట్, క్రేజ్ ఉన్నా.. అనుపమ పరమేశ్వరన్ సినిమా డైరెక్ట్ ఓటీటీలోకే..

బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతున్న అనుపమ తర్వాత సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయడం ఆశ్చర్యం. అనుపమ పరమేశ్వరన్ మెయిన్ లీడ్ లో నటించిన 'బటర్ ఫ్లై' సినిమా గత సంవత్సరమే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇప్పటికే ఈ సినిమా అనేక సార్లు వాయిదా పడింది. గతంలో ఈ సినిమాని..........

Butterfly : మార్కెట్, క్రేజ్ ఉన్నా.. అనుపమ పరమేశ్వరన్ సినిమా డైరెక్ట్ ఓటీటీలోకే..

Butterfly :  అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం ఫుల్ ఫేమ్ లో ఉంది, కార్తికేయ 2, 18 పేజెస్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంది. ఇక సోషల్ మీడియాలో కూడా అమ్మడికి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరుగుతుంది. మరోవైపు చేతిలో దాదాపు అరడజను సినిమాలు కూడా ఉన్నాయి. అనుపమకు మంచి క్రేజ్ ఉంది యూత్ లో. తెలుగులో మంచి మార్కెట్ కూడా క్రియేట్ అయింది. మలయాళంలో కూడా అనుపమకు మార్కెట్ ఉంది.

బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతున్న అనుపమ తర్వాత సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయడం ఆశ్చర్యం. అనుపమ పరమేశ్వరన్ మెయిన్ లీడ్ లో నటించిన ‘బటర్ ఫ్లై’ సినిమా గత సంవత్సరమే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇప్పటికే ఈ సినిమా అనేక సార్లు వాయిదా పడింది. గతంలో ఈ సినిమాని థియేటర్స్ లో రిలీజ్ చేస్తామంటూ ప్రమోషన్స్ కూడా చేశారు. మరి ఎందుకో కానీ సినిమా రిలీజ్ వాయిదా పడుతూనే వస్తుంది.

Saranya Ponvannan : స్టార్ ఆర్టిస్ట్ పై నిర్మాత ఫైర్.. బతిమాలినా ప్రమోషన్స్ కి రావట్లేదు..

తాజాగా ‘బటర్ ఫ్లై’ సినిమాని డిసెంబర్ 29న డిస్నిప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించారు. నిహాల్‌, భూమికా చావ్లా, రావు రమేష్‌ ఇందులో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అయితే ‘బటర్ ఫ్లై’ సినిమాని తెలుగుతో పాటు తమిళ్‌, కన్నడ, మలయాళ భాషల్లో కూడా హాట్ స్టార్ వేదికగా రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం సింపుల్ గా ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. మార్కెట్, క్రేజ్ ఉంచుకొని కూడా అనుపమ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేస్తుండటంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు.