Anushka Shetty : ప్రభాస్‌తో మళ్ళీ సినిమా గురించి క్లారిటీ ఇచ్చిన అనుష్క.. ప్రభాస్ పెద్ద స్టార్ అయ్యాడు..
అనుష్క చివరిసారిగా నిశ్శబ్దం అనే సినిమాతో ఓటీటీలో పలకరించింది. స్వీటీని వెండితెరపై చూసి దాదాపు 4 ఏళ్ళు పైనే అవుతుంది. దీంతో అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Anushka Shetty comments on Movie with Prabhas in Miss Shetty Mr Polishetty Movie Promotions
Anushka Shetty : నవీన్ పోలిశెట్టి(Naveen Polishetty), అనుష్క శెట్టి(Anushka) కాంబినేషన్ లో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి(Miss Shetty Mr Polishetty) అనే రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ సినిమా రాబోతుంది. ఇప్పటికే సినిమా ట్రైలర్ కూడా రిలీజయి సినిమాపై ఆసక్తి పెంచింది. ఈ సినిమా సెప్టెంబర్ 7న రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ కి అనుష్క దూరంగా ఉంది. అనుష్క ప్రమోషన్స్ కి ఎందుకు రావట్లేదు కారణం మాత్రం ఎవ్వరూ చెప్పట్లేదు.
అనుష్క చివరిసారిగా నిశ్శబ్దం అనే సినిమాతో ఓటీటీలో పలకరించింది. స్వీటీని వెండితెరపై చూసి దాదాపు 4 ఏళ్ళు పైనే అవుతుంది. దీంతో అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రమోషన్స్ లో కూడా అనుష్క కనిపించకపోవడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. తాజాగా అనుష్క కొంతమంది ప్రెస్ తో ఈ సినిమా గురించి చర్చించింది.
Kohli Biopic : మరోసారి బాలీవుడ్ టాక్.. కోహ్లీ బయోపిక్ లో రామ్ చరణ్.. నిర్మాతలు చరణ్ ని అడిగారా?
ఈ ఇంటర్వ్యూలో అనుష్క పలు ఆసక్తికర విషయాలని తెలిపింది. అలాగే ప్రభాస్ తో సినిమా గురించి కూడా చెప్పింది. ప్రభాస్ – అనుష్క సూపర్ హిట్ కాంబినేషన్. బిల్లా, మిర్చి, బాహుబలి 1,2.. ఇలా అన్ని సినిమాలు మంచి విజయం సాధించాయి. ఇక వీరిద్దరి మధ్య మంచి స్నేహం కూడా ఉంది. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, పెళ్లి చేసుకుంటారని గతంలో ఎన్ని వార్తలు వచ్చినా అవన్నీ అబద్దలుగానే మిగిలిపోయాయి.
తాజాగా ప్రభాస్ గురించి మాట్లాడుతూ .. నాకు ప్రభాస్ దాదాపు 15 ఏళ్ళ నుంచి తెలుసు. ఇప్పుడు పెద్ద స్టార్ హీరో అయ్యాడు. అయినా అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. మా ఇద్దరి మధ్య అదే మంచి స్నేహం కొనసాగుతుంది. ప్రభాస్ తో మళ్ళీ సినిమా చేయడానికి నేను రెడీ. కానీ దానికి తగ్గ మంచి స్క్రిప్ట్ రావాలి. దాని కోసం ఎదురుచూస్తున్నాను. మంచి స్క్రిప్ట్ వస్తే కచ్చితంగా ప్రభాస్ తో ఇంకో సినిమా చేస్తాను, మళ్ళీ నటిస్తాను అని తెలిపింది. దీంతో వీరికి అభిమానులు ప్రభాస్ – అనుష్క కాంబినేషన్ లో ఇంకో సినిమా రావాలని కోరుకుంటున్నారు.