Balakrishna : నా అభిమానుల కోసమే ఈ షో.. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ కూడా వస్తారు.. కానీ

బాలకృష్ణ మాట్లాడుతూ.. ఇటీవల చాలా మంది సినిమా వాళ్ళు టీవీలు, ఓటీటీకి వస్తున్నారు, మీరెప్పుడు వస్తారు అని అభిమానులు నన్ను కూడా అడగడంతో...........

Balakrishna : నా అభిమానుల కోసమే ఈ షో.. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ కూడా వస్తారు.. కానీ

Balakrishna about Unstoppable Season 2

Balakrishna :  బాలయ్య బాబు యాంకర్ గా మారి ఆహాలో అన్‌స్టాపబుల్ షోతో అందర్నీ అలరించారు. అభిమానులకే కాక తెలుగు ప్రేక్షకులందరికీ ఈ షో తెగ నచ్చేసింది. సినీ స్టార్ సెలబ్రిటీలని తీసుకొచ్చి వాళ్లందరితో సరదగా షోని తనదైన శైలిలో నడిపించారు బాలకృష్ణ. ఈ షో భారీ విజయం సాధించి పలు రికార్డులని కూడా క్రియేట్ చేసింది. దీంతో సీజన్ 2 కూడా ఉండాలని అంతా ఆశించారు.

అందరూ అనుకున్నట్టే మరోసారి బాలయ్య హోస్ట్ గా అన్‌స్టాపబుల్ సీజన్ 2ని కూడా ప్రకటించారు ఆహా నిర్వాహకులు. ఇప్పటికే ఫస్ట్ ఎపిసోడ్ షూట్ కూడా అయింది. ఈ సారి సినీ సెలబ్రిటీలతోనే కాక రాజకీయ నాయకులని కూడా తీసుకొస్తున్నారు. ఈ షో కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మంగళవారం సాయంత్రం విజయవాడలో ప్రత్యేకంగా ఈ షో లాంచింగ్ ఈవెంట్ ని అభిమానుల మధ్య గ్రాండ్ గా నిర్వహించారు.

ఆహా అన్‌స్టాపబుల్ సీజన్ 2 లాంచింగ్ ఈవెంట్లో బాలయ్య బాబు మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ మాట్లాడుతూ.. ఇటీవల చాలా మంది సినిమా వాళ్ళు టీవీలు, ఓటీటీకి వస్తున్నారు, మీరెప్పుడు వస్తారు అని అభిమానులు నన్ను కూడా అడగడంతో అభిమానుల కోసమే ఈ షో చేశాను. ప్రపంచవ్యాప్తంగా ఈ షోని బాగా ఆదరించారు. అందుకే మరో సీజన్ చేస్తున్నాము” అని తెలిపారు.

Unstoppable Season 2 : అన్‌స్టాపబుల్ సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్ గ్యాలరీ.. బాలయ్యతో చంద్రబాబు, లోకేష్

ఇక ఈ షోకి చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వస్తారా అనే ప్రశ్నకి బదులిస్తూ.. వాళ్లంతా రావొచ్చు. అది వాళ్ళ ఇష్టాన్ని, సమయానుకూలాన్ని బట్టి ఉంటుంది. అది ఆహా నిర్వాహకులు ప్లాన్ చేయాలి. వస్తే మంచిదే” అని తెలిపారు. దీంతో స్టార్ హీరోలు ఈ షోకి వచ్చే అవకాశాలు ఉన్నాయనే తెలుస్తుంది.