MAA Elections 2021 : ‘మా’ ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బండ్ల గణేష్..

‘మా’ జనరల్ సెక్రెటరీ పదవికి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్న బండ్ల గణేష్.. తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు..

MAA Elections 2021 : ‘మా’ ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బండ్ల గణేష్..

Bandla Ganesh

MAA Elections 2021: ఈసారి ‘మా’ అధ్యక్ష పదవికి విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, యంగ్ హీరో మంచు విష్ణు, సీనియర్ నటుడు సీవీఎల్ నరసింహ రావు పోటీ పడుతున్నారు. ఇప్పటికే ఈ ముగ్గురితో పాటు ‘మా’ జనరల్ సెక్రెటరీ పదవికి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్న బండ్ల గణేష్ కూడా నామినేషన్ వేశారు.

Republic Review : ‘రిపబ్లిక్’ మూవీ రివ్యూ

కట్ చేస్తే ఇప్పడు బండ్ల తన ‘మా’ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తన నామినేషన్ ఉప సంహరించుకున్నారు. ‘నా దైవ సమానులు, నా ఆత్మీయులు, నా శ్రేయోభిలాషుల సూచన మేరకు నేను మా జనరల్ సెక్రెటరీ నామినేషన్ ఉపసంహరించుకున్నాను’ అని తెలిపారు బండ్ల గణేష్.

MAA Elections 2021 : నేటితో నామినేషన్ల పర్వానికి తెర..

అక్టోబర్ 10వ తేది కోసం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులతో పాటు తెలుగు సినీ పరిశ్రమ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురూచూస్తుంది. ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు ‘మా’ ఎన్నికలు జరుగుతాయి. ఆరోజు సాయంత్రమే ఫలితాలు వెలువడతాయి.