Bellamkonda Ganesh: నేను స్టూడెంట్ సర్.. అంటోన్న బెల్లంకొండ హీరో!

టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ సోదరుడు బెల్లంకొండ గణేష్ ఇప్పటికే హీరోగా తన తొలి చిత్రం ‘స్వాతిముత్యం’ను రిలీజ్‌కు రెడీ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ కాకముందే, బెల్లంకొండ గణేష్ తన రెండో సినిమాను కూడా రెడీ చేశాడు.

Bellamkonda Ganesh: నేను స్టూడెంట్ సర్.. అంటోన్న బెల్లంకొండ హీరో!

Bellamkonda Ganesh New Movie Titled Nenu Student Sir

Bellamkonda Ganesh: టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ సోదరుడు బెల్లంకొండ గణేష్ ఇప్పటికే హీరోగా తన తొలి చిత్రం ‘స్వాతిముత్యం’ను రిలీజ్‌కు రెడీ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను లక్ష్మణ్ కె కృష్ణ తెరకెక్కిస్తుండగా, త్వరలోనే రిలీజ్ చేసి హిట్ కొట్టాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే, బెల్లంకొండ గణేష్ తన రెండో సినిమాను కూడా రెడీ చేశాడు.

Bellamkonda Ganesh: స్కూటర్ ఎక్కిన స్వాతిముత్యం.. వచ్చేది ఎప్పుడంటే?

హీరో అల్లరి నరేశ్‌కు ‘నాంది’ లాంటి సాలిడ్ హిట్ మూవీని అందించిన SV2 ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై బెల్లంకొండ గణేష్ తన నెక్ట్స్ మూవీని చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేశారు. దర్శకుడు తేజ అసిస్టెంట్ రాఖీ ఉప్పలపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ‘నేను స్టూడెంట్ సర్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను ఫిక్స్ చేసింది చిత్ర యూనిట్. ఇక ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో బెల్లంకొండ గణేష్ తాను స్టూడెంట్ అంటూ తనను చుట్టుముట్టిన పోలీసులకు తన ఐడీ కార్డును చూపిస్తూ కనిపించాడు.

Swathimuthyam: నీ చారెడు కళ్లే.. అంటూ పాటందుకున్న స్వాతిముత్యం!

నిర్మాతలు ఈ సినిమాను కూడా నాంది తరహా థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిస్తున్నట్లు ఈ పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. ఇక ఈ సినిమాలో సముథ్రకణి, సునీల్, శ్రీకాంత్ ఐయంగర్, ఆటో రాంప్రసాద్, చదణ్ దీప్, తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మహతి స్వర సాగర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ పూర్తవగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.