శివన్న ‘భజరంగీ 2’ టీజర్ అదిరిపోయిందిగా!

కన్నడ సూపర్ స్టార్, కరునాడ చక్రవర్తి డా.శివరాజ్ కుమార్ ‘భజరంగి 2’ టీజర్..

శివన్న ‘భజరంగీ 2’ టీజర్ అదిరిపోయిందిగా!

కన్నడ సూపర్ స్టార్, కరునాడ చక్రవర్తి డా.శివరాజ్ కుమార్ బర్త్ డే సందర్భంగా ఆయన నటించిన కొత్త చిత్రం “బజరంగీ-2’’ టీజర్ రిలీజ్ చేసింది చిత్రబృందం. ఈ మూవీ 2013 లో వచ్చి సూపర్ హిట్ అయిన ‘‘బజరంగీ” చిత్రానికి సీక్వెల్. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. కన్నడ చిత్రమే అయిన కానీ పాన్ ఇండియా చిత్రం తరహాలో బాలీవుడ్ తో సహా అన్ని సౌత్ భాషల వాళ్ళు ఈ చిత్ర టీజర్ ను ఆన్ లైన్ లో షేర్ చేస్తూ టీజర్ భలే ఉందంటూ మెచ్చుకోవడం విశేషం.

Bhajarangi-2

ఈ రెస్పాన్స్ చూసి దర్శక నిర్మాతలు ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. త్వరలోనే తెలుగులో కూడా ఈ సినిమా డబ్ కానుంది. టీజర్ చూసి పలువురు ప్రొడ్యూసర్ లు, డిస్ట్రిబ్యూటర్ లు ఈ సినిమా డబ్బింగ్ రైట్స్ కోసం ఎంక్వైరీ చేస్తున్నారు.

Dr.Shivarajkumar

టీజర్ కు వచ్చిన రెస్పాన్స్ గురుంచి హీరో శివ‌రాజ్ కుమార్ మాట్లాడుతూ : 2013 లో మేము తీసిన “బజరంగీ” పెద్ద హిట్ కావడంతో దానికి సీక్వెల్ గా ఈ “బజరంగీ-2’’ మూవీ భారీగా తీయాలని భావించాం. కానీ ఈ టీజర్ కు ఇంత రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదు.అన్ని ఇండస్ట్రీల నుండి కాల్స్ వస్తున్నాయి. ఈ అద్భుతమైన రెస్పాన్స్ కి అందరికీ ధన్యవాదాలు” అన్నారు.

BHAJARANGI 2-Kannada Movie

ఇక “బజరంగీ-2” టీజర్ విజువల్ గా అద్భుతంగా ఉంది. బాక్ గ్రౌండ్ స్కోర్, గ్రాఫిక్స్ షాట్స్ చూస్తుంటే మరో “కెజిఎఫ్” తరహా సినిమా కాబోతుంది అనిపిస్తుంది. పీరియాడిక్ సోషియో ఫాంటసీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీలో శివరాజ్ కుమార్ సరసన భావన హీరోయిన్‌‌గా నటిస్తుంది. జయన్న ఫిలిమ్స్ బ్యానర్ పై జయన్న మరియు భోగేంద్ర కలిసి నిర్మిస్తున్న ఈ మూవీని ఎ.హర్ష డైరెక్ట్ చేశారు. థియేటర్లు ఓపెన్ అవ్వగానే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.