BoyCott Adipurush : ట్రెండింగ్‌లో బాయ్‌కాట్ ఆదిపురుష్.. రామాయణం పోలికలే లేవు.. బాలీవుడ్ మళ్ళీ అదే తప్పు చేస్తోందా??

ఇప్పుడు ఏకంగా బాయ్‌కాట్ ఆదిపురుష్, బ్యాన్ ఆదిపురుష్ అని ట్విట్టర్లో ట్రెండ్ చేస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. బాయ్‌కాట్ బాలీవుడ్ అంటూ గత కొన్ని రోజులుగా బాలీవుడ్ పై...........

BoyCott Adipurush : ట్రెండింగ్‌లో బాయ్‌కాట్ ఆదిపురుష్.. రామాయణం పోలికలే లేవు.. బాలీవుడ్ మళ్ళీ అదే తప్పు చేస్తోందా??

Boycott Adipurush trend in Twitter

BoyCott Adipurush :  ఇటీవల ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ప్రభాస్ ఆదిపురుష్ టీజర్ రిలీజయింది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడుగా నటించారు. అయితే టీజర్ రిలీజైన దగ్గరనించి టీజర్ పై, సినిమాపై, డైరెక్టర్ పై విమర్శలు, ట్రోల్స్ వస్తున్నాయి.

ఒకవైపు ప్రభాస్ అభిమానులు రామాయణం అని చెప్పి బొమ్మల సినిమా, గ్రాఫిక్స్ సినిమా తీశారేంటి అని తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. మరోవైపు ఏమో అసలు అందులో రామాయణం ఎక్కడుంది. రావణాసురుడు ఎలా ఉంటాడో తెలీదా, హనుమంతుడు ఎలా ఉంటాడో తెలీదా అంటూ హిందూ సంఘాలు, హిందువులు, బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. రామాయణం అని చెప్పి ఏదో హాలీవుడ్ గ్రాఫిక్స్ సినిమా చూపిస్తున్నారని, అందులో రామాయణం ఆనవాళ్లు ఒక్కటి కూడా లేవని దర్శకుడు ఓం రౌత్ ని విమర్శిస్తున్నారు.

ఇప్పుడు ఏకంగా బాయ్‌కాట్ ఆదిపురుష్, బ్యాన్ ఆదిపురుష్ అని ట్విట్టర్లో ట్రెండ్ చేస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. బాయ్‌కాట్ బాలీవుడ్ అంటూ గత కొన్ని రోజులుగా బాలీవుడ్ పై వ్యతిరేకత వస్తున్న సంగతి తెలిసిందే. దీనికి ఎన్ని కారణాలు ఉన్నా ముఖ్య కారణం బాలీవుడ్ సినిమాల్లో హిందూ దేవుళ్ళని, పురాణాల్ని, హిందూ చరిత్రని వక్రీకరించడం. ప్రతి సారి దేవుళ్లకి సంబంధించిన సినిమాలు బాలీవుడ్ లో వస్తే ఇదే జరుగుతుంది. ఇప్పుడు ఆదిపురుష్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది.

SP Balu : ఎస్పీ బాలు విగ్రహం.. ఓపెన్ కాకముందే తీసుకెళ్లి పడేసిన గుంటూరు మున్సిపల్ అధికారులు.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్..

రామాయణం, మహాభారతం అంటే తెలుగులో ఎన్టీఆర్ లాంటి ఎంతోమంది గొప్ప సినిమాల్లాగా చిత్రీకరించారు. కానీ బాలీవుడ్ వాళ్ళు ఇలా హిందూ పురాణాల్ని నాశనం చేస్తున్నారంటూ నార్త్ తో పాటు సౌత్ కూడా విమర్శిస్తోంది. ఆదిపురుష్ టీజర్ చూస్తుంటేనే అర్థమైపోతుంది అసలు రామాయణం పాత్రలకి ఇక్కడ కనపడేవాటికి సంబంధం లేదని. అందుకే ఇప్పుడు బాయ్‌కాట్ ఆదిపురుష్ , బ్యాన్ ఆదిపురుష్ దేశవ్యాప్తంగా ట్రెండింగ్ లో ఉంది.

బాలీవుడ్ తెలిసి కూడా మళ్ళీ మళ్ళీ ఇదే తప్పు చేస్తోందని అంటున్నారు. ఇది కనుక సినిమా రిలీజ్ అయ్యే టైంకి కూడా ఇలాగే ఉంటే ప్రభాస్ కెరీర్ కి గట్టి దెబ్బె తగులుతుంది. మొన్న లైగర్, ఇప్పుడు ఆదిపురుష్ చూసి అసలు తెలుగు హీరోలు బాలీవుడ్ వాళ్ళతో సినిమాలు చేయకండి అని కామెంట్స్ చేస్తున్నారు తెలుగు ప్రేక్షకులు.