SP Balu : ఎస్పీ బాలు విగ్రహం.. ఓపెన్ కాకముందే తీసుకెళ్లి పడేసిన గుంటూరు మున్సిపల్ అధికారులు.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్..

గుంటూరు నగరంలోని మదర్‌ థెరీసా కూడలిలో కళా దర్బార్‌ సంస్థ అధ్వర్యంలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్‌, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి తెలియజేసే, ఆదివారం రాత్రి.........

SP Balu : ఎస్పీ బాలు విగ్రహం.. ఓపెన్ కాకముందే తీసుకెళ్లి పడేసిన గుంటూరు మున్సిపల్ అధికారులు.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్..

SP Balu statue issue in Guntur

SP Balu :  ఎన్నో పాటలతో ప్రేక్షకులని అలరించి మెప్పించిన ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కరోనా సమయంలో మరణించిన సంగతి తెలిసిందే. అయన మరణం సినీ సంగీత పరిశ్రమకి తీరని లోటు. ఎంతోమంది కళాకారులు ఆయనకు నేటికీ నివాళులు అర్పిస్తున్నారు. తాజాగా గుంటూరులో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని మున్సిపల్ అధికారులు తీసేయడం వివాదంగా మారింది.

గుంటూరు నగరంలోని మదర్‌ థెరీసా కూడలిలో కళా దర్బార్‌ సంస్థ అధ్వర్యంలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్‌, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి తెలియజేసే, ఆదివారం రాత్రి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఇది ఇంకా ముసుగు వేసే ఉంది. త్వరలోనే ఘనంగా ఓపెన్ చేయిద్దాం అనుకున్నారు. కానీ సోమవారం ఉదయం వెళ్లిచూడగా అక్కడి విగ్రహం నగరపాలక వాటర్‌ ట్యాంకర్ల ప్రాంగణంలో పడేసి ఉంది. దీంతో కళాకారులు, బాలు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Nagarjuna : ఘోస్ట్ సినిమా హిట్ అయితే దానికి ప్రీక్వెల్ ఉంటుంది..

అయితే గుంటూరు కార్పొరేషన్‌ ప్రణాళికాధికారి GSN మూర్తి ఈ వివాదంపై మాట్లాడుతూ.. కోర్టుల ఆదేశాల మేరకు ప్రధాన కూడళ్లు, రహదారుల్లో విగ్రహాలు ఏర్పాటు చేయకూడదు. బాలు విగ్రహం పెట్టిన ప్రదేశం నిత్యం ట్రాఫిక్‌తో రద్దీగా ఉంటుంది. దానికి అనుమతి కూడా లేదు, అందుకే తొలిగించమని తెలిపారు.

అయన వ్యాఖ్యలపై కళాదర్బార్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ”ఎస్పీ బాలు విగ్రహం ఏర్పాటుకు అనుమతి కోసం రెండేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోలేదు. ఇప్పుడు కలెక్టర్, ఎమ్మెల్సీ అనుమతితోనే ఆ విగ్రహాన్ని పెట్టాము, ఇంకా ఓపెన్ చేయకుండానే తీసుకెళ్లి అలా పడేశారు. ఒక గొప్ప గాయకుడికి ఇవ్వాల్సిన గౌరవం ఇదేనా. గుంటూరులో దాదాపు 100పైగా అనుమతి లేని రాజకీయ నాయకుల విగ్రహాలు ఉన్నాయి. వాటిని తీయగలరా మున్సిపల్ వాళ్ళు” అని ప్రశ్నించి మున్సిపల్ అధికారులు క్షమాపణలు చెప్పి బాలు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. గాయకుడు బాలు గారి విగ్రహాన్ని ఇలా పడేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.