Brahmastra Pre-Release Event: ప్రీరిలీజ్ ఈవెంట్‌కు రెడీ అయిన బ్రహ్మాస్త్రం.. చివరి నిమిషంలో షాకిచ్చిన పోలీసులు!

బాలీవుడ్‌లో తెరకెక్కుతన్న ప్రెస్టీజియస్ మూవీ బ్రహ్మాస్త్రం, ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. విజువల్ వండర్‌గా వస్తున్న ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను సెప్టెంబర్ 2న రామోజీ ఫిలిం సిటీలో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. కాగా, చివరి నిమిషంలో బ్రహ్మాస్త్రం ప్రీరిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయ్యింది.

Brahmastra Pre-Release Event: ప్రీరిలీజ్ ఈవెంట్‌కు రెడీ అయిన బ్రహ్మాస్త్రం.. చివరి నిమిషంలో షాకిచ్చిన పోలీసులు!

Brahmastra Pre-Release Event Cancelled

Brahmastra Pre-Release Event: బాలీవుడ్‌లో తెరకెక్కుతన్న ప్రెస్టీజియస్ మూవీ బ్రహ్మాస్త్రం, ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. కేవలం బాలీవుడ్‌లోనే కాకుండా, ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా యావత్ దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు అయాన్ ముఖర్జీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

Brahmastra Pre Release Event : బాలీవుడ్ బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్టుగా టాలీవుడ్ స్టార్.. మాములుగా లేదుగా మన క్రేజ్..

అయితే ఈ సినిమాను తెలుగులో దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి సమర్పిస్తుండటంతో ఈ సినిమాపై ఇక్కడ కూడా భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. విజువల్ వండర్‌గా వస్తున్న ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను సెప్టెంబర్ 2న రామోజీ ఫిలిం సిటీలో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ ప్రీరిలీజ్ వేడుకకు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్టుగా వస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. ఇక ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం బ్రహ్మాస్త్రం చిత్ర యూనిట్ ఇప్పటికే హైదరాబాద్‌లో ల్యాండ్ అయ్యింది.

Brahmastra: బ్రహ్మాస్త్ర విజన్.. మామూలుగా లేదుగా!

కాగా, చివరి నిమిషంలో బ్రహ్మాస్త్రం ప్రీరిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయ్యింది. రామోజీ ఫిలిం సిటీలో భారీ స్థాయిలో వేడుకను నిర్వహించేందుకు చిత్ర యూనిట్ రెడీ కాగా.. పోలీసులు ఈ వేడకకు బందోబస్తును ఇవ్వలేమని తేల్చిచెప్పారు. హైదరాబాద్‌లో గణేశ్ ఉత్సవాల నేపథ్యంలో ఈ ఈవెంట్‌కు సెక్యూరిటీ ఇవ్వలేమని పోలీసులు చెప్పారు. దీంతో బ్రహ్మాస్త్రం ప్రీరిలీజ్ ఈవెంట్‌ను వాయిదా వేయగా, ఇవాళ సాయంత్రం పార్క్ హయత్ హోటల్‌లో చిత్ర యూనిట్ మీడియాతో మాట్లాడనుంది. మరి ఈ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారో చూడాలి. ఇక ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, నాగార్జున అక్కినేని లాంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.