Brahmastra Pre Release Event : బాలీవుడ్ బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్టుగా టాలీవుడ్ స్టార్.. మాములుగా లేదుగా మన క్రేజ్..

తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ మన టాలీవుడ్ స్టార్ హీరోని తన సినిమా ప్రమోషన్స్ కి వాడుకోబోతున్నాడు. రణబీర్ కపూర్ నటించిన భారీ బడ్జెట్ సినిమా బ్రహ్మాస్త్రం సెప్టెంబర్ 9న రిలీజ్ కానుంది. పాన్ ఇండియా వైడ్ అన్ని భాషల్లో.....................

Brahmastra Pre Release Event : బాలీవుడ్ బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్టుగా టాలీవుడ్ స్టార్.. మాములుగా లేదుగా మన క్రేజ్..

NTR as Chief Guest for Brahmastra Pre Release Event

Brahmastra Pre Release Event :  బాలీవుడ్ సినిమాలు వరుసగా ఫ్లాప్ అవ్వడం, బాయ్ కట్ బాలీవుడ్ ట్రెండ్ ఉండటంతో బాలీవుడ్ స్టార్స్ అంతా సౌత్ మార్కెట్ మీద పడ్డారు. ముఖ్యంగా తెలుగు మార్కెట్ మీద ఫోకస్ చేశారు. ఇటీవల అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా సినిమా టాలీవుడ్ లో ఏ రేంజ్ ప్రమోషన్స్ చేసిందో అందరికి తెలిసిందే. అమీర్ ఖాన్ కోసం నాగార్జున తో పాటు ఏకంగా మెగాస్టార్ కూడా రంగంలోకి దిగి ప్రమోషన్స్ చేశారు. అయినా ఆ సినిమా ఆశించినంత ఫలితం అందుకోలేదు. టాలీవుడ్ సినిమాలు వరుసగా బాలీవుడ్ లో హిట్ అవ్వడం, మన హీరోలు అక్కడ క్రేజ్ తెచ్చుకోవడంతో బాలీవుడ్ స్టార్లు మన వాళ్ళని ప్రమోషన్స్ లో తెగ వాడేస్తున్నారు.

తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ మన టాలీవుడ్ స్టార్ హీరోని తన సినిమా ప్రమోషన్స్ కి వాడుకోబోతున్నాడు. రణబీర్ కపూర్ నటించిన భారీ బడ్జెట్ సినిమా బ్రహ్మాస్త్రం సెప్టెంబర్ 9న రిలీజ్ కానుంది. పాన్ ఇండియా వైడ్ అన్ని భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. బ్రహ్మాస్త్ర సినిమాలో నాగార్జున కూడా ఉండటం, రాజమౌళి సినిమాని తెలుగులో రిలీజ్ చేయడంతో ఇప్పటికే తెలుగులో రాజమౌళి, నాగార్జున ఈ సినిమాని తెగ ప్రమోట్ చేస్తున్నారు.

Karthikeya 2 : నిఖిల్ ఏంటి..? బాలీవుడ్ కి వెళ్లడమేంటి..?.. కర్నూలు గడ్డ మీద కార్తికేయ 2 వంద కోట్ల సెలబ్రేషన్స్.. స్పీచ్ అదరగొట్టిన నిఖిల్

ఇప్పుడు బ్రహ్మాస్త్ర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి RRRతో ఇండియా వైడ్ క్రేజ్ సంపాదించిన ఎన్టీఆర్ గెస్టుగా రాబోతున్నారు. బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 2న హైదరాబాద్ లో జరగనుంది. ఈ ఈవెంట్ కి ఎన్టీఆర్ గెస్టుగా రానున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించారు. ఇప్పటికే ఈ సినిమాలో నాగార్జున యాక్ట్ చేయడం, సినిమాని రాజమౌళి తెలుగులో విడుదల చేయడం, ఇప్పుడు ఎన్టీఆర్ గెస్టుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రానుండటంతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఎన్టీఆర్ గెస్టుగా వస్తాడని తెలియడంతో ఎన్టీఆర్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ ఈ ఈవెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. కొన్ని రోజుల నుంచి బాలీవుడ్ ఎదుర్కొంటోన్న ఫ్లాపులకి బ్రహ్మాస్త్ర అడ్డుకట్ట వేస్తుందేమో చూడాలి.