Bro Movie : పవన్ రెమ్యునరేషన్, బ్రో బడ్జెట్ పై వస్తున్న విమర్శలకు నిర్మాత గట్టి కౌంటర్.. 

బ్రో కలెక్షన్స్, బడ్జెట్, రెమ్యునరేషన్.. ఇలా వీటన్నిటి గురించి మాట్లాడి నిర్మాతకు పెద్ద లాస్, పవన్ సినిమాలకు కలెక్షన్స్ రావట్లేదు అంటూ విమర్శలు చేస్తున్నారు.

Bro Movie : పవన్ రెమ్యునరేషన్, బ్రో బడ్జెట్ పై వస్తున్న విమర్శలకు నిర్మాత గట్టి కౌంటర్.. 

Bro Movie Producer TG Vishwa Prasad Counters to criticisms on Pawan Kalyan Remuneration and Bro Movie Budget

Bro Movie Producer :  ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan kalyan), సాయిధ‌ర‌మ్‌ తేజ్ (Sai Dharam Tej) క‌లిసి నటించిన ‘బ్రో'(Bro) సినిమా జులై 28న గ్రాండ్ గా రిలీజయి మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకొని సూపర్ హిట్ కొట్టింది. ఒక మంచి ఎమోషనల్ స్టోరీకి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి, పవన్ ఫ్యాన్స్ కోసం స్పెషల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి సినిమాని ఓ రేంజ్ కి తీసుకెళ్లారు. బ్రో సినిమా అటు పవన్ అభిమానులకి, ఇటు ఫ్యామిలీలకు కూడా విపరీతంగా కనెక్ట్ అయింది. ఇప్పటికే ఈ సినిమా 110 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి దూసుకుపోతుంది.

అయితే సినిమాలో పృథ్వీ పాత్ర అంబటి రాంబాబుని ఉద్దేశించే తీశారు అని సినిమా రిలీజ్ నుంచి వివాదంగా మారింది. అంబటి రాంబాబు ఇప్పటికే రెండు సార్లు ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ ని తిట్టారు. ఇక సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్, వైసిపి ఫ్యాన్స్ గొడవలు పడుతున్నారు. బ్రో కలెక్షన్స్, బడ్జెట్, రెమ్యునరేషన్.. ఇలా వీటన్నిటి గురించి మాట్లాడి నిర్మాతకు పెద్ద లాస్, పవన్ సినిమాలకు కలెక్షన్స్ రావట్లేదు అంటూ విమర్శలు చేస్తున్నారు.

August Movie Releases : ఆగష్టులో థియేటర్స్‌లో రిలీజ్ కాబోతున్న సినిమాలివే.. మీరు ఏ మూవీకి..?

తాజాగా బ్రో సినిమా నిర్మాత TG విశ్వప్రసాద్ ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా అందులో బ్రో సినిమా బడ్జెట్, కలెక్షన్స్ గురించి అడిగారు. దీనికి విశ్వప్రసాద్ సమాధానమిస్తూ.. అది మాకు, జీ కంపెనీకి ఉన్న ఒప్పందం బయటి వాళ్లకు అనవసరం అని అన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ గురించి అడగగా.. అది మా కంపెనీకి, పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఒప్పందం. బయటకు చెప్పాల్సిన వసరం లేదు. ఆయన ట్యాక్స్ ఫైల్ చేసేటప్పుడు ఆయన చూపిస్తారు, మా కంపెనీ ట్యాక్స్ ఫైల్ చేసేటప్పుడు మేము చూపిస్తాం. మిగిలిన వాళ్లకు అవసరంలేదు అంటూ కౌంటర్ ఇచ్చారు నిర్మాత. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.