Godfather: ఓటీటీ డేట్ ఫిక్స్ చేసిన ‘గాడ్‌ఫాదర్’.. వచ్చేది ఎప్పుడంటే?

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ‘గాడ్‌ఫాదర్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను మలయాళ మూవీ ‘లూసిఫర్’కు రీమేక్‌గా దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కించాడు. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాను నవంబర్ 19న స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు నెట్‌ఫ్లిక్స్ తాజాగా వెల్లడించింది.

Godfather: ఓటీటీ డేట్ ఫిక్స్ చేసిన ‘గాడ్‌ఫాదర్’.. వచ్చేది ఎప్పుడంటే?

Godfather: మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ‘గాడ్‌ఫాదర్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను మలయాళ మూవీ ‘లూసిఫర్’కు రీమేక్‌గా దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కించాడు. ఈ సినిమాలో చిరు సరికొత్త లుక్‌లో కనిపించడంతో ఈ సినిమాను చూసేందుకు అభిమానులు ఆసక్తిని చూపారు. ఇక తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా కథలో కొన్ని మార్పులు చేయడంతో ఈ సినిమా తెలుగు ఆడియెన్స్‌కు బాగానే కనెక్ట్ అయ్యింది.

Godfather: గాడ్‌ఫాదర్ ఫస్ట్ టైటిల్ కాదా..?

చిరు పవర్‌ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను మరోసారి కట్టిపడేసింది. ఇక థమన్ అందించిన సంగీతం ఈ సినిమాకు బోనస్‌గా నిలిచింది. ఈ సినిమాలో సత్యదేవ్, నయనతారల పర్ఫార్మెన్స్‌లకు తోడుగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ స్పెషల్ రోల్ కూడా ఆడియెన్స్‌ను థ్రిల్ చేసింది. మొత్తంగా గాడ్‌ఫాదర్ బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్‌కు మంచి సక్సెస్‌ను అందించింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు రెడీ అవుతోంది.

Godfather: సల్లూ భాయ్ కోసం మెగాస్టార్ కాస్ట్‌లీ సర్‌ప్రైజ్.. ఏమిటో తెలుసా?

ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌పాం నెట్‌ఫ్లిక్స్ గాడ్‌ఫాదర్ చిత్ర డిజిటల్ రైట్స్‌ను దక్కించుకుంది. ఈ సినిమాను నవంబర్ 19న స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు నెట్‌ఫ్లిక్స్ తాజాగా వెల్లడించింది. దీంతో మెగా ఫ్యాన్స్ ఈ సినిమాను ఓటీటీలో ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో తెలియాలంటే నవంబర్ 19 వరకు వెయిట్ చేయాల్సిందే.

Chiranjeevi Godfather Locks OTT Release Date