‘ఆహా’ అనిపిస్తున్న ‘కలర్ ఫోటో’

  • Published By: sekhar ,Published On : November 17, 2020 / 05:23 PM IST
‘ఆహా’ అనిపిస్తున్న ‘కలర్ ఫోటో’

Updated On : November 17, 2020 / 5:28 PM IST

Colour Photo: సుహాస్, చాందిని చౌదరి జంటగా సందీప్ రాజ్ దర్శకత్వంలో వచ్చిన బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ ‘కలర్ ఫోటో’.. ఇటీవల తొలి తెలుగు ఓటీటీ ‘ఆహా’ లో రిలీజ్ అయిన ఈ సినిమాకు ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీల నుంచి మంచి స్పందన వచ్చింది.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, జగపతి బాబు, నాని, రవితేజ వంటి హీరోలు సినిమా చూసి మూవీ టీంను పర్సనల్‌గా పిలిపించుకుని మరీ అభినందించారు. ఈ సినిమా ఇప్పుడు 50 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ దాటింది. మీ ప్రేమతో మమ్మల్ని ‘ఆహా’ అనిపించారు అంటూ 50 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసినట్టు అధికారికంగా ప్రకటించారు.


సుహాస్ నేచురల్ యాక్టింగ్, హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ, సునీల్ విలనిజం, కాలభైరవ పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్, విజువల్స్ సినిమాకు ప్లస్ అయ్యాయి. ‘కలర్ ఫోటో’ మూవీ టీంకి మరిన్ని ఆఫర్లు తెచ్చిపెడుతోంది.