సినిమా ఇండస్ట్రీతో ‘కమిట్‌మెంట్’..

నాలుగు క‌థ‌ల‌తో న‌డిచే ఆంథాల‌జీ ‘కమిట్‌మెంట్’ సినిమా.. త్వరలో విడుదల..

  • Published By: sekhar ,Published On : January 30, 2020 / 05:26 AM IST
సినిమా ఇండస్ట్రీతో ‘కమిట్‌మెంట్’..

నాలుగు క‌థ‌ల‌తో న‌డిచే ఆంథాల‌జీ ‘కమిట్‌మెంట్’ సినిమా.. త్వరలో విడుదల..

‘హైదరాబాద్ నవాబ్స్’, ‘నిన్న నేడు రేపు’, ‘కమీనా’ వంటి సినిమాలను తెరకెక్కించిన ల‌క్ష్మీకాంత్ చెన్నా దర్శకత్వంలో ఫూట్ లూస్ ఎంటర్టైన్మెంట్, ఎఫ్ త్రీ ప్రొడక్షన్స్ ప‌తాకాల‌పై బ‌ల్దేవ్‌ సింగ్‌, నీలిమ‌. టి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘కమిట్‌మెంట్‌’. తేజస్విని మడివాడ, అమిత్ తివారి, అన్వేషి జైన్, తనిష్క్‌ రాజన్, అభి, సూర్య శ్రీనివాస్, రమ్య పసుపులేటి, సిమర్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో న‌టించారు. నాలుగు క‌థ‌ల‌తో న‌డిచే ఆంథాల‌జీ ఈ సినిమా. స‌మాజంలో జ‌రిగే కొన్ని సంఘ‌ట‌న‌ల ఆధారంగా తీసుకొని ఈ చిత్రాన్ని నిర్మించ‌డం జ‌రిగింది. ఈ చిత్రం టైటిల్ అనౌన్స్‌మెంట్ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో…
నిర్మాత బ‌ల్దేవ్‌ సింగ్ మాట్లాడుతూ : “ఈ చిత్రం పోస్టర్‌ని చూసి ఒక అంచనాకి రావొద్దు. ఈ సినిమాలో మంచి సందేశం కూడా ఉంది. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది” అన్నారు.

Image result for COMMITMENT TELUGU MOVIE 2020
దర్శకుడు లక్ష్మి కాంత్ మాట్లాడుతూ : ‘‘ద్వారకేష్, సురేష్ గార్ల ద్వారానే నాకు ఈ అవకాశం వచ్చింది. నేను గతంలో ‘పరిచయం’ అనే సినిమా తీయడం జరిగింది. దానికి అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదు. అందుకే అన్ని వర్గాల ప్రేక్షకులకి కావాల్సిన అంశాలతో ఈ సినిమా తెరకెక్కించాను. ఈ సినిమాలో బోల్డ్ కంటెంట్‌తో పాటు మంచి సందేశం కూడా ఉంది. నాలుగు విభిన్నమైన కథలు ఈ సినిమాలో కనిపిస్తాయి. స్క్రీన్‌ప్లే చాలా కొత్తగా ఉంటుంది. అందరూ పూర్తిగా ఎంటర్టైన్ అయ్యే సబ్జెక్ట్. మీరు డబ్బులు పెట్టి టికెట్ కొన్నందుకు తప్పకుండా న్యాయం చేస్తుంది’’ అన్నారు.

Read Also : రీమేక్ అనగానే దిల్ రాజుకి మెంటల్ అనుకున్నారు – ట్రెండింగ్‌లో ‘జాను’ ట్రైలర్..

Commitment
ద‌ర్శ‌క‌త్వం : ల‌క్ష్మీకాంత్ చెన్నా
నిర్మాత‌లు : బ‌ల్దేవ్‌ సింగ్‌, నీలిమ‌. టి
ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్ : ద్వారకేష్
లైన్ ప్రొడ్యూసర్ : సురేష్ పోలాకి
సినిమాటోగ్రఫీ : సజీష్‌ రాజేంద్రన్, నరేష్ రానా
మ్యూజిక్ : నరేష్ కుమరన్‌
ఆర్ట్‌ : సుప్రియ బట్టే పట్టి
ఎడిటర్ : ప్రవీణ్ పూడి
కాన్సెప్ట్ : ఈశ్వర్ రెడ్డి.