Ajay Devgn : మరో సౌత్ సినిమాని నాశనం చేయడానికి రెడీ అయిన బాలీవుడ్.. ఖైదీ సినిమా రీమేక్ లో హీరోయిన్ ని పెడుతున్నారు..

ఖైదీ సినిమా రీమేక్ లో కూడా మార్పులు చేస్తున్నారు. ఖైదీ సినిమా రీమేక్ హక్కులని అజయ్ దేవగణ్ కొనుక్కొని తనే దర్శకత్వం వహిస్తున్నాడు. భోళా అనే టైటిల్ తో హిందీలో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇందులో.............

Ajay Devgn : మరో సౌత్ సినిమాని నాశనం చేయడానికి రెడీ అయిన బాలీవుడ్.. ఖైదీ సినిమా రీమేక్ లో హీరోయిన్ ని పెడుతున్నారు..

created heroine character in khaidi bollywood remake

Ajay Devgn :  కార్తీ నటించిన ఖైదీ సినిమా తెలుగు, తమిళ్ లో భారీ విజయం సాధించింది. ఒక్క రాత్రిలో జరిగిన కథగా ఈ సినిమాని తెరకెక్కించారు. ఇందులో పాటలు, హీరోయిన్స్ లేరు అయినా మంచి విజయం దక్కింది. కలెక్షన్స్ కూడా భారీగా వచ్చాయి. ఈ సినిమాకి సీక్వెల్ కూడా ప్రకటించారు చిత్ర యూనిట్.

అయితే ఇటీవల బాలీవుడ్ కన్ను సౌత్ సినిమాల మీద పడిన సంగతి తెలిసిందే. సౌత్ లో మంచి విజయం సాధించిన సినిమాలని బాలీవుడ్ లో రేంక్ చేస్తున్నారు. కానీ వీటిల్లో చాలావరకు ఫ్లాప్ అవుతున్నాయి. కథని ఉన్నదున్నట్టుగా తీయకుండా బాలీవుడ్ వల్ల ఇష్టం వచ్చినట్టు మార్పులు చేస్తున్నారు. అక్కర్లేకుండా సాంగ్స్, ఫైట్స్, రొమాంటిక్ సన్నివేశాలని ఇరికిస్తున్నారు. దీంతో ఇక్కడ హిట్ అయిన సినిమాలు బాలీవుడ్ లో ఫట్ అవుతున్నాయి.

ఇప్పుడు ఖైదీ సినిమా రీమేక్ లో కూడా మార్పులు చేస్తున్నారు. ఖైదీ సినిమా రీమేక్ హక్కులని అజయ్ దేవగణ్ కొనుక్కొని తనే దర్శకత్వం వహిస్తున్నాడు. భోళా అనే టైటిల్ తో హిందీలో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇందులో టబు కూడా ఓ పాత్రలో నటిస్తుంది. టబు పాత్ర కూడా ఒరిజినల్ లో లేకపోయినా సృష్టించినట్లు తెలుస్తుంది. ఒరిజినల్ ఖైదీలో లేని పాత్రలని కూడా ఇందులో సృష్టిస్తున్నారు.

Shruti Haasan : బాయ్‌కాట్‌ బాలీవుడ్ పై స్పందించిన శ్రుతిహాసన్.. ఆన్‌లైన్‌లో ద్వేషం బాగా పెరిగిపోయింది..

ఈ రీమేక్ లో అమలాపాల్ స్పెషల్ అప్పీరెన్స్ ఇవ్వనుంది. అజయ్ దేవగణ్ సరసన నటించనుంది. అసలు ఒరిజినల్ సినిమాలో ఈ క్యారెక్టర్ లేకపోయినా బాలీవుడ్ లో పెడుతున్నారు. దీంతో మరో మంచి సినిమాని కూడా నాశనం చేస్తున్నారు ఈ బాలీవుడ్ వాళ్ళు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. అసలు హిట్స్ లేవంటారు, రీమేక్ సినిమాలని కూడా ఇలా ఇష్టమొచ్చినట్టు మార్చేస్తే ఇవి కూడా ఫ్లాప్ అవుతున్నాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి చూడాలి ఈ సినిమా బాలీవుడ్ లో ఏ రేంజ్ లో విజయం సాధిస్తుందో.