Dulquer Salmaan: నన్ను వ్యక్తిగతంగా ట్రోల్ చేసే ప్రతిఒక్కరి ఐడీలు.. నా దగ్గర స్క్రీన్ షాట్స్ ఉన్నాయి.. దుల్క‌ర్ స‌ల్మాన్!

సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోడానికి డబ్బు, సపోర్ట్ ఉంటే సరిపోదు, టాలెంట్ కూడా ఉండాలి. ఆ టాలెంట్ లేకపొతే ఎంతటి స్టార్ హీరో కొడుకైన ప్రేక్షకులు ఆదరించరు. అయితే కొంతమంది స్టార్ హీరోల కొడుకులు.. వారి టాలెంట్ ని నిరూపించుకున్నప్పటికీ వారసులుగా వచ్చినందుకు నేపోటిజం అనే ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రస్తుతం అయన నటించిన హిందీ మూవీ ప్రమోషన్స్ లో ఒక విలేకరి, దుల్క‌ర్ స‌ల్మాన్ పై వస్తున్న ట్రోల్స్ పై ప్రశ్నించగా..

Dulquer Salmaan: నన్ను వ్యక్తిగతంగా ట్రోల్ చేసే ప్రతిఒక్కరి ఐడీలు.. నా దగ్గర స్క్రీన్ షాట్స్ ఉన్నాయి.. దుల్క‌ర్ స‌ల్మాన్!

Dulquer Salmaan Reaction Social Media Trolls

Dulquer Salmaan: సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోడానికి డబ్బు, సపోర్ట్ ఉంటే సరిపోదు, టాలెంట్ కూడా ఉండాలి. ఆ టాలెంట్ లేకపొతే ఎంతటి స్టార్ హీరో కొడుకైన ప్రేక్షకులు ఆదరించరు. ఇండస్ట్రీలో కొంతమంది ఎటువంటి సపోర్ట్ లేకుండా వారి టాలెంట్, కష్టాన్ని నమ్ముకుని పైకి వచ్చి స్టార్ లు అనిపించుకుంటుంటే.. మరి కొంతమంది టాలెంట్ లేకున్నా స్టార్ ల వారసులగా పరిచయమై ఒక్క నైట్ లో స్టార్స్ అయిపోతున్నారు.

Dulquer Salmaan : నాకు యాక్టింగ్ రాదని, సినిమాలు ఆపేస్తే మంచిదని రివ్యూలు రాసేవాళ్ళు.. చాలా బాధపడ్డాను..

అయితే కొంతమంది స్టార్ హీరోల కొడుకులు.. వారి టాలెంట్ ని నిరూపించుకున్నప్పటికీ వారసులుగా వచ్చినందుకు నేపోటిజం అనే ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మలయాళ నటుడు దుల్క‌ర్ స‌ల్మాన్ కూడా ఇలాంటి ఆరోపణలు ఎదురుకోక తప్పలేదు. ప్రస్తుతం అయన నటించిన హిందీ మూవీ “చుప్: ది రివెంజ్ అఫ్ ది ఆర్టిస్ట్” ప్రమోషన్స్ లో భాగంగా ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఈ సమావేశంలో ఒక విలేకరి, దుల్క‌ర్ స‌ల్మాన్ పై వస్తున్న ట్రోల్స్ పై ప్రశ్నించగా, దుల్క‌ర్ మాట్లాడుతూ.. గతంలో అభిషేక్ బచ్చన్ గురించి ఒక విషయం విన్నా. ఆయనను విమర్శిస్తూ రాసిన ఆర్టికల్స్ ని అద్దంపై అతికించుకుని రోజు చదువుతారట. నేను కూడా అంతే, పేస్ బుక్ నుంచి యూట్యూబ్ వరకు నన్ను విమర్శిస్తూ వచ్చిన ట్రోల్స్ అన్ని స్క్రీన్ షాట్ తీసుకుని పెట్టుకుంటా. నా ఫోన్ గ్యాలరీ చుస్తే సగం అవే ఉంటాయి. అప్పుడప్పుడు వాటిని చదువుతుంటా. ప్రత్యేకంగా నన్ను పర్సనల్ గా టార్గెట్ చేస్తూ ట్రోల్ చేసిన ప్రతి ఒక్కరి ఐడీలు నాకు బాగా గుర్తుంటాయి” అంటూ వెల్లడించాడు.