Dulquer Salmaan : నాకు యాక్టింగ్ రాదని, సినిమాలు ఆపేస్తే మంచిదని రివ్యూలు రాసేవాళ్ళు.. చాలా బాధపడ్డాను..

దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. ''నా కెరీర్ ఆరంభంలో నా మీద చాలా నెగిటివ్ రివ్యూలు, విమర్శలు వచ్చాయి. నా సినిమాల రిలీజ్ తర్వాత రివ్యూలు చదవడం, చూడటం చేసేవాడిని. వాళ్ళు చెప్పేవి వింటే...............

Dulquer Salmaan : నాకు యాక్టింగ్ రాదని, సినిమాలు ఆపేస్తే మంచిదని రివ్యూలు రాసేవాళ్ళు.. చాలా బాధపడ్డాను..

Dulquer Salmaan share his career bad experiences

Dulquer Salmaan :  మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తన డబ్బింగ్ సినిమాలతో ఇప్పటికే తెలుగు, తమిళ్ ప్రేక్షకులకి చేరువయ్యాడు. ఇటీవలే సీతారామం సినిమాతో దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులని మెప్పించి భారీ విజయం అందుకున్నాడు. ఇప్పుడు ఒక రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకి రానున్నాడు దుల్కర్.

దుల్కర్‌ త్వరలో ‘చుప్‌: రివేంజ్‌ ఆఫ్‌ ది ఆర్టిస్ట్‌’ అనే సినిమాతో రాబోతున్నాడు. బాలీవుడ్‌ డైరెక్టర్‌ ఆర్‌ బాల్కీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ బాలీవుడ్ సినిమా సెప్టెంబర్‌ 23న పాన్ ఇండియా భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో దుల్కర్‌ ఒక ఆర్టిస్ట్ గా, నెగిటివ్ రివ్యూస్‌, చెడు విమర్శలు ఎదుర్కొనే నటుడిగా, రివెంజ్ తీర్చుకునే ఒక సీరియల్ కిల్లర్ గా కనిపించనున్నాడు. ప్రస్తుతం దుల్కర్ చుప్ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఏర్పాటు చేసిన ఓ ప్రెస్ మీట్ లో తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కున్న విమర్శల గురించి తెలిపాడు.

Aparna Balamurali : లావుగా ఉన్నానని 27 ఏళ్లకే తల్లి పాత్రలు చేయమని అడుగుతున్నారు..

దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. ”నా కెరీర్ ఆరంభంలో నా మీద చాలా నెగిటివ్ రివ్యూలు, విమర్శలు వచ్చాయి. నా సినిమాల రిలీజ్ తర్వాత రివ్యూలు చదవడం, చూడటం చేసేవాడిని. వాళ్ళు చెప్పేవి వింటే చాలా బాధగా అనిపించేది. నా నటన బాగోలేదని, మా నాన్న లాగా నేను ఆర్టిస్ట్ అవ్వలేనని, నాకు యాక్టింగ్ రాదని, నేను సినిమాలు ఆపేయడం మంచిదని రాసేవారు. చాలా తీవ్రంగా నాపై విమర్శలు చేసేవారు. నాపై వచ్చిన ఆ నెగిటివ్ కామెంట్స్ అన్ని చూసి మొదట్లో చాలా బాధపడ్డాను” అని తన కెరీర్ లోని విమర్శల గురించి తెలిపాడు.