Timothée Chalamet : ప్రేమ రూమర్‌ని అఫీషియల్ చేసిన ‘డూన్’ హీరో.. పబ్లిక్‌గా ఘాటు ముద్దు..

డూన్ హీరో 'తిమోతీ చలమెట్' తన ప్రేమ రూమర్ ని ఎట్టకేలకు నిజం చేశాడు. హాలీవుడ్ యాక్ట్రెస్ కైలీ జెన్నర్..

Timothée Chalamet : ప్రేమ రూమర్‌ని అఫీషియల్ చేసిన ‘డూన్’ హీరో.. పబ్లిక్‌గా ఘాటు ముద్దు..

Dune actor Timothée Chalamet kisses Kylie Jenner video

Updated On : September 6, 2023 / 7:21 PM IST

Timothée Chalamet : ప్రముఖ హాలీవుడ్ నటుడు ‘తిమోతీ చలమెట్’ తన ప్రేమ రూమర్ ని ఎట్టకేలకు నిజం చేశాడు. హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ మూవీ ‘డూన్’ (Dune) తో ఇండియన్ ఆడియన్స్ లో మంచి గుర్తింపుని సంపాదించుకున్న తిమోతీ చలమెట్.. గత కొంత కాలంగా ప్రముఖ హాలీవుడ్ యాక్ట్రెస్ కైలీ జెన్నర్ (Kylie Jenner) తో ప్రేమాయణం నడుపుతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. కొన్ని నెలలు నుంచి ఇద్దరు కలిసి డేటింగ్ కూడా మొదలు పెట్టారని హాలీవుడ్ లో వినిపిస్తూ వచ్చాయి.

Manchu Manoj : మంచు మనోజ్ రీ ఎంట్రీ వెండితెర పై కాదా..? బుల్లితెర మీదనా..!

అయితే ఈ వార్తలు పై ఈ జంట మాత్రం అసలు రెస్పాండ్ అవ్వలేదు. అయితే తాజాగా ఆ వార్తలన్నిటికి ఒక్క ముద్దుతో బదులిచ్చేశాడు. లాస్ ఏంజెల్స్ లో జరిగిన బెయోన్స్ కచేరీ (Beyonce’s concert) లో ఈ ఇద్దరు కలిసి కనిపించారు. ఇక అక్కడే తమ ప్రేమ రూమర్స్ ని కూడా నిజం చేశారు. తమ బంధాన్ని తెలియజేస్తూ.. తిమోతీ, కైలీకి ఘాటు లిప్ లాక్ ఇచ్చాడు. ఇలా కెమెరా ముందే పబ్లిక్ పలుసార్లు కైలీకి ఘాటు ముద్దు ఇచ్చి తమ ప్రేమని అఫీషియల్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.

Ram Charan : ప్రభాస్ ఛాలెంజ్‌ని స్వీకరించిన రామ్ చరణ్.. నెల్లూరు చేపల పులుసు..

కాగా కైలీ పలు పాపులర్ టీవీ షోలతో ఫేమ్ ని సంపాదించుకొని ప్రస్తుతం హాలీవుడ్ స్టార్ గా రాణిస్తుంది. ఇక డూన్ మూవీతో తిమోతీ చలమెట్ వరల్డ్ వైడ్ గా ఫేమ్ ని సంపాదించుకున్నాడు. రెండు భాగాలుగా తెరకెక్కిన డూన్ మూవీ ఫస్ట్ పార్ట్ సూపర్ హిట్ అవ్వడంతో.. సెకండ్ పార్ట్ కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సెకండ్ పార్ట్ బట్టి థర్డ్ పార్ట్ ని కూడా ప్లాన్ చేస్తామంటూ మేకర్స్ గతంలో అనౌన్స్ చేశారు.