Ram Charan : ప్రభాస్ ఛాలెంజ్‌ని స్వీకరించిన రామ్ చరణ్.. నెల్లూరు చేపల పులుసు..

ప్రభాస్ ఛాలెంజ్‌ని స్వీకరించిన రామ్ చరణ్.. తన ఫేవరెట్ డిష్ చెప్పి ఆ ఛాలెంజ్ ని రానా దగ్గుబాటికి ట్రాన్స్‌ఫర్ చేశాడు.

Ram Charan : ప్రభాస్ ఛాలెంజ్‌ని స్వీకరించిన రామ్ చరణ్.. నెల్లూరు చేపల పులుసు..

Ram Charan accepts Anushka Shetty MSMPrecipechallenge from Prabhas

Ram Charan : అనుష్క శెట్టి (Anushka Shetty) స్టార్ట్ చేసిన #MSMPrecipechallenge ఛాలెంజ్ ముందుకు సాగుతూ వెళ్తుంది. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ (Miss Shetty Mr Polishetty) సినిమాలో అనుష్క ఒక చెఫ్ గా నటించింది. దీంతో ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఒక కొత్త ఛాలెంజ్ ని మొదలు పెట్టింది. ఈ ఛాలెంజ్ లో ఫేవరెట్ ఫుడ్ ఐటెం అండ్ దాని రెసిపీని షేర్ చేయాలి. ఈక్రమంలోనే అనుష్క.. మంగుళూరు చికెన్ క్రరీ, నీర్ దోశ తన ఫేవరెట్ అంటూ రెసిపీని షేర్ చేసింది. ఆ తరువాత ప్రభాస్ కి ఈ ఛాలెంజ్ ని ఇచ్చింది.

Jawan : ‘జవాన్’ మూవీని మహేష్ బాబుతో కలిసి చూస్తా అంటున్న షారుఖ్ ఖాన్..

ఇక అనుష్క ఛాలెంజ్ ని స్వీకరించిన ప్రభాస్.. ‘రొయ్యల పలువా’ తన ఫేవరెట్ డిష్ అంటూ అందుకు సంబంధించిన రెసిపీని షేర్ చేశాడు. అలాగే ఈ ఛాలెంజ్ ని రామ్ చరణ్ కి ట్రాన్స్‌ఫర్ చేశాడు. తాజాగా చరణ్ ఈ ఛాలెంజ్ ని స్వీకరించి తన ఫేవరెట్ రెసిపీని తెలిపాడు. ‘నెల్లూరు చేపల పులుసు’ తన ఫేవరెట్ డిష్ అని, దాని రెసిపీని షేర్ చేశాడు. ఇక ఈ ఛాలెంజ్ ని తాను రానా దగ్గుబాటికి షేర్ చేస్తున్నట్లు పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి రానా ఏ రెసిపీతో వస్తాడో చూడాలి.

Naresh-Pavitra : మరోసారి స్టేజిపై నరేష్, పవిత్ర సందడి.. ముద్దులు, ముద్దు పేరులతో..

ఇక ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా విషయానికి వస్తే.. న‌వీన్ పొలిశెట్టి (Naveen Polishetty) ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. కొత్త దర్శకుడు పి.మ‌హేష్ బాబు ఈ సినిమాని రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు. సెప్టెంబ‌ర్ 7న తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ కాబోతుంది. యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై వంశీ, ప్ర‌మోద్‌లు నిర్మించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి విజయం అందుకుంటుందో చూడాలి.