హీరో హీరోయిన్ ఫస్ట్‌లుక్

నవీన్ చంద్ర న్యూ మూవీ 'హీరో హీరోయిన్' ఫస్ట్‌లుక్.

  • Published By: sekhar ,Published On : February 8, 2019 / 08:14 AM IST
హీరో హీరోయిన్ ఫస్ట్‌లుక్

నవీన్ చంద్ర న్యూ మూవీ ‘హీరో హీరోయిన్’ ఫస్ట్‌లుక్.

అందాల రాక్షసితో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నవీన్ చంద్ర, ఆ తర్వాత హీరోగా సక్సెస్ కాలేక పోయాడు. మనోణ్ణి వరసగా ఫ్లా‌ప్‌లు పలకరిస్తున్నాయి. నేను లోకల్, దేవదాస్, అరవింద సమేత మూవీస్‌లో నవీన్ చేసిన ఇంపార్టెంట్ రోల్స్ ఆడియన్స్‌ని ఆకట్టుకున్నాయి. ఇప్పుడు హీరోగా మరో ప్రయత్నం చేస్తున్నాడు. నవీన్ చంద్ర, గాయత్రీ సురేష్, పూజా జవేరి హీరో, హీరోయిన్స్‌గా, అడ్డా ఫేం.. జీ.ఎస్. కార్తీక్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సినిమా.. ‘హీరో హీరోయిన్’. ‘ఎ పైరేటెడ్ లవ్‌స్టోరీ’ అనేది ట్యాగ్‌లైన్. స్వాతి పిక్చర్స్ బ్యానర్‌పై, భార్గవ్ మన్నె నిర్మిస్తున్న ఈ మూవీ ఫస్ట్‌లుక్ రిలీజ్ అయ్యింది.

నవీన్ చంద్ర, పూజా జవేరి బైక్‌పై కూర్చుని ఉన్నారు. నవీన్ సిగరెట్ నోట్లో పెట్టుకుని ఉండగా, పూజా లైటర్‌తో సిగరెట్ వెలిగిస్తుంది. పైరసీ బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతున్న లవ్ స్టోరీ ఇది. వచ్చే వారం టీజర్ రిలీజ్ చెయ్యబోతున్నారు. అభిమన్యు సింగ్, కబీర్ సింగ్, జయప్రకాష్ రెడ్డి, సారిక రామచంద్రరావు తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి సంగీతం : అనూప్ రూబెన్స్, కెమెరా : వెంకట్ గంగాధరీ, ఎడిటింగ్ : జునైద్ సిద్ధికీ, ఫైట్స్ : రియల్ సతీష్.