Mahatma Gandhi Diet: జాతిపిత మహాత్మా గాంధీ డైట్ ఇదే..! ఆయనలా మీరూ ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారం తీసుకోవాల్సిందే..!
తిండి విషయంలో చాలా కంట్రోల్ గా ఉండే వారు గాంధీజీ. రోజుకి మూడుసార్లు మాత్రమే తినే వారు.

Mahatma Gandhi Diet: జాతిపిత మహాత్మా గాంధీ.. క్రమశిక్షణకు మారు పేరు అని చెప్పాలి. ఆ రోజుల్లోనే ఆయన హెల్త్ గురించి బాగా కేర్ తీసుకునే వారు. ఆరోగ్యానికి సంబంధించి నియమాలను కచ్చితంగా ఫాలో అయ్యేవారు. ఆహారం విషయంలో చాలా శ్రద్ధ వహించే వారు. అందుకే ఆయన అంత హెల్తీగా, ఫిట్ గా ఉండేవారు. మరి ఆయన పాటించిన డైట్ ఏంటి, తీసుకున్న ఆహారం ఏంటి తెలుసుకుందాం..
తిండి విషయంలో బాపూజీ చాలా స్ట్రిక్ట్ గా ఉండే వారు. ఏది పడితే అది, ఎంత పడితే అంత అస్సలు తినే వారు కాదు. కొందరు అదే పనిగా తింటూ ఉంటారు. ఆకలి ఉన్నా లేకున్నా ఏదో ఒకటి కడుపులోకి నెడుతుంటారు. పిజ్జాలు, బర్గర్లు, సమోసాలు, కూల్ డ్రింక్స్.. ఇలా చెత్తా చెదారంతో కడుపు నింపేస్తుంటారు. ఆ తర్వాత జబ్బుల బారిన పడతారు. అయితే, గాంధీజీ అలా కాదు. కేవలం బతకడానికి ఆహారాన్ని ఒక మెడిసిన్ లా తీసుకోవాలని చెప్పేవారు. అంతేకాదు పాటించే వారు కూడా. ఆహారం కోసం బతుకుతున్నట్లు తినకూడదంటారు. అది గాంధీజీ పాలసీ.
తిండి విషయంలో చాలా కంట్రోల్ గా ఉండే వారు గాంధీజీ. రోజుకి మూడుసార్లు మాత్రమే తినే వారు. అది కూడా తృణధాన్యాలు, కూరగాయలు, పండ్లు, పాలు, పాల పదార్దాలు తీసుకునే వారు. తిండి విషయంలో తన క్రమశిక్షణను టెస్ట్ చేసుకోవడానికి గాంధీజీ ఒక్కోసారి రోజు మొత్తంలో ఐదంటే ఐదే పదార్ధాలు తినేవారు. కొన్నిసార్లు ఉపవాసం ఉండేవారు. దీని వల్ల శరీరం, మైండ్ రీసెట్ అవుతాయని భావించే వారు. ఇలాంటి ఇంటెర్ మిటెంట్ ఫాస్టింగ్ వల్ల గట్ హెల్త్ మెరుగుపడుతుంది, జీర్ణవ్యవస్థ పనితీరు బాగుంటుంది.
ఆహారం విషయంలో చాలా కఠినంగా ఉండేవారు గాంధీ. ఏదైనా తినకూడదని ఒకసారి ఫిక్స్ అయ్యారంటే.. జీవితంలో దాని జోలికెళ్లే వారే కాదు. అంత స్ట్రిక్ట్ గా ఉండేవారు.
మహాత్మా గాంధీ డైట్..
* మసాలా, ఉప్పు, కారం ఎక్కువగా ఉండే ఆహార పదార్ధాలను ఆయన ఇష్టపడే వారు కాదు.
* పచ్చి కూరగాయలు, పండ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు.
* రిఫైండ్ చేసిన చక్కెర, పిండి పదార్దాలను పూర్తి నిషేధం.
* ప్రాంతాల వారీగా అందుబాటులో ఉండే ఆహార పదార్దాలను తీసుకునేవారు.
* కాలానికి అనుగుణంగా లభించే పండ్లను తీసుకునే వారు.
* ఆయన డైట్ లో మేక పాలు ఉండేవి.
* తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకునే వారు.
ఇలా ఆహారం విషయంలో నియమ నిబంధనలు పాటించారు కాబట్టే ఆయన ఎంతో ఫిట్ గా, హెల్తీగా ఉండేవారు. మంచి ఆహారం తీసుకోవడం వల్లే జబ్బుల బారిన పడలేదు బాపూజీ. అందుకే, మీరు కూడా గాంధీలా హెల్తీగా, ఫిట్ గా ఉండాలంటే.. ఫుడ్ ని కంట్రోల్ చేయాల్సిందే. చెత్త, చెదారాన్ని కడుపులో వేయడం ఆపేయాలి. ఆరోగ్యానికి ఏది మంచిదో అదే తీసుకోవాలి.
Also Read: దీపావళి వేళ బంగారం ధరలు తగ్గుతాయా? నిపుణులు ఏమంటున్నారంటే? కొనాలనుకుంటున్నారా?