Kojagiri Purnima: అక్టోబర్ 6.. కోజాగరి పూర్ణిమ.. ఈ పూజ చేస్తే మీ ఇంట్లో కనకవర్షం ఖాయం..!
ఈ ఏడాది కౌముది లక్ష్మీ వ్రతం సోమవారం వచ్చింది. ఇది ఇంకా శక్తిమంతం. సోమవారానికి అధిపతి చంద్రుడు.

Kojagiri Purnima: అక్టోబర్ 6.. కౌముది లక్ష్మీ వ్రతం సందర్భంగా ఎలాంటి విధానాలు పాటించాలో, తద్వారా కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. ఆశ్వీజ మాసంలో రాత్రి పూట పౌర్ణమి తిథి ఉన్న రోజును కోజాగరి పూర్ణిమ అనే పేరుతో పిలుస్తారు. ఈ కోజాగరి పూర్ణిమ రోజు కౌముది లక్ష్మీవ్రతం అనే ప్రత్యేకమైన వ్రతాన్ని ఆచరించడం ద్వారా మీ ఇంట్లో లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది.
అక్టోబర్ 6 సోమవారంతో కూడినటువంటి కౌముది లక్ష్మీవ్రతం. సోమవారంతో కూడి కోజాగరి పూర్ణిమ. చాలా అరుదుగా వచ్చేటటువంటి శక్తిమంతమైన రోజు. భూలోక సంచారం కోసం వచ్చే లక్ష్మీదేవి కటాక్షం కోసం ఇలా పూజ చేయాలి. వీలైతే కనకధారస్తోత్రం, శ్రీసూక్తం చాటింగ్స్ పెట్టుకుని అందరూ గవ్వల శబ్దం చేయాలి. దానివల్ల లక్ష్మీదేవి శక్తి మీ ఇంట్లోకి ప్రవేశించి ఏడాది మొత్తం అనుగ్రహిస్తుంది.
కోజాగరి అంటే నిద్ర మేలుకుని ఉన్నది ఎవరు అని అర్థం. లక్ష్మీదేవి ప్రతి సంత్సరం ఆశ్వీజ మాసంలో రాత్రికి పౌర్ణమి ఉన్నప్పుడు భూలోక సంచారానికి వస్తుంది. అలా వచ్చే లక్ష్మీదేవి ఏ ఇంట్లో అయితే గవ్వల శబ్దం వినపడుతూ ఉంటుందో ఆ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఆ ఇంట్లో ఉన్న వారందరినీ అనుగ్రహిస్తుంది. అందుకే దీన్ని కోజాగరి వ్రతం పేరుతో పిలుస్తారు.
నిద్ర మేలుకుని గవ్వల శబ్దం చేస్తారో..
ఎవరైతే ఇంట్లో నిద్ర మేలుకుని ఉండి గవ్వల శబ్దం చేస్తుంటారో వారి ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించి వారందరిని కూడా సంవత్సరం మొత్తం అనుగ్రహిస్తుంది. దీన్ని కౌముది లక్ష్మీ వ్రతం అని ఎందుకు అంటారు అంటే కౌముది అంటే వెన్నెల. పౌర్ణమి రోజు వెన్నెల ఉంటుంది. అందువల్ల దీన్ని కౌముది లక్ష్మీ వ్రతం అంటారు.
ఈ ఏడాది కౌముది లక్ష్మీ వ్రతం( కోజాగరి పూర్ణిమ) సోమవారం వచ్చింది. ఇది ఇంకా శక్తిమంతం. సోమవారానికి అధిపతి చంద్రుడు. చంద్రుడికి అధిష్టాన దైవం లక్ష్మీదేవి అని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పారు. అందుకే ఈ ఏడాది వచ్చే కౌముది లక్ష్మీ వ్రతం అద్భుతమైన శక్తి కలిగుంది. అక్టోబర్ 6 సాయంత్రం పూట లక్ష్మీదేవికి ప్రత్యేకమైన పూజ ఇంట్లో చేయండి. ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకుని అభిషేకిస్తున్నట్లు గజలక్ష్మి దేవి ఫోటో కానీ, కుడిచేత్తో బంగారు నాణెలు వర్షిస్తున్నటువంటి ధనలక్ష్మి దేవి ఫోటోకు కానీ బొట్లు పెట్టి ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దీపం పెట్టి, శ్రీ మహాలక్ష్మి దేవిని తెల్లటి పుష్పాలతో పూజించాలి.
ఓం శ్రీం శ్రీయై నమ: ఈ మంత్రాన్ని 108 లేదా 54 లేదా 21సార్లు వీలును బట్టి చదువుకోవాలి. అమ్మవారికి తెల్లటి పదార్దాలను (పటిక బెల్లం) నైవేద్యంగా పెట్టాలి. పాలు కచ్చితంగా నైవేద్యంగా పెట్టాలి. పాలతో చేసిన పాయసం నైవేద్యంగా పెట్టండి. ఆ తర్వాత ఆరు బయట వెన్నెల్లో ఉంచాలి. చంద్ర కిరణాలు పడ్డాక మళ్లీ లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఉంచి తర్వాత కుటుబసభ్యులు ప్రసాదంగా తీసుకోవాలి. ఆ తర్వాత ఇంట్లో వాళ్లందరూ గవ్వల శబ్దం చేస్తూ ఉండాలి. అప్పుడు భూలోక సంచారానికి వచ్చిన లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఆ లక్మి శక్తి ఏడాది మొత్తం మిమ్మల్ని అనుగ్రహిస్తుంది.
కష్టాలు, బాధలు, సమస్యలు అన్నీ పోవాలంటే పాలతో పాయం చేసి ఆరుబయట వెన్నెల్లో పెట్టి ఆరుబయట వెన్నెల్లో కూర్చుని లక్ష్మీ అష్టోత్తర శతనామావళి, లలితా సహస్ర నామాలు వంటివి చదువుకోవాలి. లక్ష్మీ దేవి శక్తి ఏడాది మొత్తం మీ కుటుంబంలో అందరి మీద ఉంటుంది. అమ్మవారి అనుగ్రహానికి సులభంగా పాత్రులు కావొచ్చు.
Also Read: ఐశ్వర్యం ఉన్నా అనుభవించలేకపోతున్నారా? ఈ దీపం వెలిగిస్తే తిరుగులేదంతే..!