Mount Everest: మౌంట్ ఎవరెస్ట్‌పై మంచు తుపాను బీభత్సం.. 16వేల అడుగల ఎత్తులో.. చిక్కుకుపోయిన వెయ్యి మంది..

ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎవరెస్ట్ క్యాంపులకు వెళ్లే రహదారుల్లో మంచును తొలగిస్తున్నారు.

Mount Everest: మౌంట్ ఎవరెస్ట్‌పై మంచు తుపాను బీభత్సం.. 16వేల అడుగల ఎత్తులో.. చిక్కుకుపోయిన వెయ్యి మంది..

Updated On : October 5, 2025 / 11:38 PM IST

Mount Everest: మౌంట్ ఎవరెస్ట్ పై మంచు తుపాను బీభత్సం సృష్టించింది. భారీ హిమపాతం చోటు చేసుకోవడంతో టిబెట్ వైపుగా 16వేల అడుగుల ఎత్తులో 1000 మంది వరకు చిక్కుకుపోయారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రెస్క్యూ బృందాలతో పాటు స్థానికులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

శుక్రవారం సాయంత్రం నుంచి మంచు తుపాను స్టార్ట్ అయ్యింది. శనివారం నాటికి తీవ్రమైంది. అక్కడి రోడ్లన్నీ మంచుతో కప్పబడ్డాయి. విషయం తెలిసిన వెంటనే స్థానికులు, రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎవరెస్ట్ క్యాంపులకు వెళ్లే రహదారుల్లో మంచును తొలగిస్తున్నారు. ఈ ఉత్పాతంతో సందర్శకులను నిలిపివేశారు.

ఇప్పటికే నేపాల్ లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కొండ చరియలు విరిగిపడ్డాయి. వరదలు ముంచెత్తాయి. ఈ విలయంలో 51మంది చనిపోయారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానతో కొండచరియలు విరిగిపడటంతో పాటు వరదలు సంభవిస్తున్నాయి. రోడ్లు, ఇళ్లు కొట్టుకుపోయాయి. ఒక్క ఐలం జిల్లాలోనే 37మంది మరణించారు.

Also Read: డార్జిలింగ్‌లో వర్ష బీభత్సం.. కూలిన వంతెన.. విరిగిపడిన కొండచరియలు.. చిన్నారులుసహా 17మంది మృతి.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మోదీ..