Rajasekhar Reddy : సుధీర్, రష్మీ.. ఇద్దర్నీ పెట్టి గజ్జెల గుర్రం సినిమా చేస్తాను..

ఇటీవల సుధీర్ హీరోగా, గెహనా సిప్పి హీరోయిన్ గా వచ్చిన గాలోడు సినిమా అందర్నీ ఆశ్చర్యపరుస్తూ మంచి విజయం సాధించింది. రొటీన్ కమర్షియల్ కంటెంట్ అయినా సుధీర్ క్రేజ్..........

Rajasekhar Reddy : సుధీర్, రష్మీ.. ఇద్దర్నీ పెట్టి గజ్జెల గుర్రం సినిమా చేస్తాను..

galodu director rajasekhar reddy wants to direct a movie with sudheer and rashmi

Rajasekhar Reddy :  ఇటీవల సుధీర్ హీరోగా, గెహనా సిప్పి హీరోయిన్ గా వచ్చిన గాలోడు సినిమా అందర్నీ ఆశ్చర్యపరుస్తూ మంచి విజయం సాధించింది. రొటీన్ కమర్షియల్ కంటెంట్ అయినా సుధీర్ క్రేజ్, పెద్ద సినిమాలు లేకపోవడంతో గాలోడు సినిమాకి బాగా కలిసొచ్చింది. గాలోడు సినిమా కలెక్షన్స్ కూడా అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి. సుధీర్ కి ఇంత మార్కెట్ ఉందా అని అనుకుంటున్నారు. కొంతమంది యువ హీరోలకంటే కూడా సుధీర్ గాలోడు సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. దీంతో గాలోడు చిత్ర యూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది.

గాలోడు సినిమా డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలని వెల్లడించారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లోనే సాఫ్ట్‌వేర్ సుధీర్ సినిమా వచ్చింది. అయితే ఆ సినిమా అంతగా విజయం సాధించలేదు. తాజాగా వచ్చిన గాలోడు మంచి హిట్ కొట్టింది.

రాజశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ”మొదట సాఫ్ట్‌వేర్ సుధీర్ సినిమాకు వేరే హీరో అనుకున్నాం. కానీ ఆ కథకి తగ్గట్టు కొంచెం హ్యూమర్ ఉంటే బాగుంటుందని సుధీర్ ని తీసుకున్నాం. సాఫ్ట్‌వేర్ సుధీర్, గాలోడు రెండు సినిమాలు ఒకేసారి ఓకే అయ్యాయి. మొదట గాలోడు సినిమా తీయాలనుకున్నాం. కానీ కొన్ని కారణాల వల్ల సాఫ్ట్‌వేర్ సుధీర్ ముందొచ్చింది. గాలోడు సినిమా మంచి విజయం సాధించడం చాలా ఆనందంగా ఉంది. సాఫ్ట్‌వేర్ సుధీర్, గాలోడు సినిమా కథలను రష్మీకి కూడా చెప్పాం.”

BiggBoss 6 Day 79 : ఇంటి సభ్యులని హౌజ్‌లోకి పంపి సర్‌ప్రైజ్ చేసిన బిగ్‌బాస్.. ఎమోషనల్ అయిన కంటెస్టెంట్స్..

”వారిద్దరి కాంబినేషన్ కి బయట మంచి క్రేజ్ ఉంది. కానీ రష్మీ డేట్స్ అడ్జస్ట్ అవ్వడం లేదు. రష్మీ, సుధీర్‌ ఇద్దరితో కచ్చితంగా ఓ సినిమా చేయాలి అనుకుంటున్నాను. వారిద్దరితో గజ్జెల గుర్రం అనే సినిమాను తీయాలనుకుంటున్నాను. అయితే గజ్జెల గుర్రం కేవలం కథ మాత్రమే ఉంది. దాన్ని బౌండెడ్ స్క్రిప్ట్ కోసం వర్క్ చేయాలి. ఇందుకు కొంచెం టైం పడుతుంది. అలాగే రష్మీ కూడా డేట్స్ ఇవ్వాలి. త్వరలోనే రష్మీ, సుధీర్ తో గజ్జెల గుర్రం సినిమా చేస్తాను” అని తెలిపాడు. దీంతో వారిద్దరి కాంబినేషన్లో ఎప్పట్నుంచో సినిమా కోసం ఎదురు చూస్తున్న అభిమానులు ఈ సినిమా త్వరగా అవ్వాలని కోరుకుంటున్నారు.