Hanu-Man: కార్తికేయ-2 మ్యాజిక్‌ను కొనసాగించనన్న హనుమాన్..?

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న సూపర్ హీరో మూవీ ‘హనుమాన్’ ప్రస్తుతం యావత్ భారతదేశ ఆడియెన్స్ చూపును తనవైపుకు తిప్పుకుంది. ఇక ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ వర్మ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుండగా, యంగ్ హీరో తేజ సజ్జా ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

Hanu-Man: కార్తికేయ-2 మ్యాజిక్‌ను కొనసాగించనన్న హనుమాన్..?

Hanu-Man To Continue Karthikey 2 Success In North Belt

Hanu-Man: టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న సూపర్ హీరో మూవీ ‘హనుమాన్’ ప్రస్తుతం యావత్ భారతదేశ ఆడియెన్స్ చూపును తనవైపుకు తిప్పుకుంది. ఇక ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ వర్మ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుండగా, యంగ్ హీరో తేజ సజ్జా ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. అయితే విజువల్స్ పరంగా ఈ సినిమా నెక్ట్స్ లెవెల్‌లో ఉండబోతుందని ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, టీజర్లు మనకు చెబుతున్నాయి. అయితే ఈ సినిమాపై దక్షిణాది అభిమానులతో పాటు నార్త్ ఆడియెన్స్ కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు.

HanuMan Official Teaser : హనుమాన్ టీజర్ వచ్చేసింది.. టీజర్‌లో ఎండ్‌లో వచ్చే సీన్ అయితే గూస్‌బంప్స్..

ఇప్పటికే టాలీవుడ్ సినిమాల సత్తా ఎలా ఉంటుందో వారు పలుమార్లు చూస్తూ వచ్చారు. ఇక రీసెంట్‌గా వచ్చిన కార్తికేయ-2 మూవీ మరోసారి బాలీవుడ్‌ను దడదడలాడించింది. కళ్లు చెదిరే కలెక్షన్లతో ఈ సినిమా అక్కడ సెన్సేషన్ క్రియేట్ చేయగా, ఇప్పుడు అందరి చూపు హనుమాన్ సినిమాపై పడింది. కార్తికేయ-2 అక్కడ క్రియేట్ చేసిన సెన్సేషన్‌ను, హనుమాన్ మూవీ ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తుందని చిత్ర వర్గాలు భావిస్తున్నాయి. ఈ సినిమా టీజర్ వారిని అబ్బురపరచడంతో, నార్త్ ఆడియెన్స్ ఈ సినిమా విజువల్ ఫీస్ట్‌గా ఉండబోతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Hanu-Man : ‘అంజనాద్రి’ ప్రపంచంలోకి తీసుకెళ్తున్న ‘హనుమంతు’..

ఇక ఈ సినిమాను ప్రశాంత్ వర్మ ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించగా, ఈ సినిమాలోని కంటెంట్ ప్రేక్షకులను కట్టిపడేయడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి. కార్తికేయ-2 చిత్రం నార్త్ బెల్ట్ ఆడియెన్స్‌ను ఇంప్రెస్ చేసినట్లుగానే హనుమాన్ మూవీ కూడా వారికి అదిరిపోయే ట్రీట్ ఇవ్వడం ఖాయమని చిత్ర వర్గాలు భావిస్తున్నాయి. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో చిత్ర యూనిట్ ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.