హర్భజన్ సింగ్ తొలి చిత్రం ఫస్ట్ లుక్

  • Published By: bheemraj ,Published On : June 5, 2020 / 08:51 PM IST
హర్భజన్ సింగ్ తొలి చిత్రం ఫస్ట్ లుక్

భారత మాజీ బౌలర్ హర్భజన్ సింగ్ టీమ్ ఇండియా సాధించిన విజయాల్లో  కీలక పాత్ర పోషించారు. క్రీడాకారుడిగా స్టేడియంలో సత్తా చాటిన బజ్జీ ప్రస్తుతం వెండితెరపై కూడా అదరగొట్టడానికి సిద్ధమవుతున్నారు. తమిళ సినిమా ఫ్రెండ్ షిప్ తో నటుడిగా తెరంగేట్రం చేయనున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను శుక్రవారం విడుదల చేశారు. ఆసక్తికరంగా ఉన్న ఈ ప్రచార చిత్రం అభిమానులను అలరిస్తోంది. హర్భజన్ సింగ్ తొలి చిత్రం కావడంతో ఫస్ట్ లుక్ వైరల్ గా మారింది. ఇండియా ట్విటర్ ట్రెండ్స్ లో 4వ స్థానంలో ఉంది. 

ప్రముఖ నటుడు అర్జున్ షిప్ కీలక పాత్ర పోషిస్తున్నారు. జాన్ పాల్ రాజ్, శ్యాం సూర్య సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఆగస్టులో ఈ సినిమాకు డైరెక్షన్ వహిస్తున్నారు. కాలేజీ, చదువు, క్రీడలు నేపథ్యంలో దీన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం. తమిళంతోపాటు తెలుగులోనూ ఈ సినిమా విడుదల కాబోతోంది. 

శ్రీలంకకు చెందిన యాంకర్ లాస్లియా ఈ సినిమాతో కోలీవుడ్ పరిచయం కానుండటం మరో విశేషం. ఆమె విలక్షణ నటుడు కమల్ హాసన్ వ్యాఖ్యతగా బిగ్ బిన్ తమిళ సీజన్ లో పాల్గొన్నారు.

Read: హిందీలో అల వైకుంఠపురం..హీరో ఎవరు ?