Kartikeya Gummakonda : తన చిన్ననాటి కలను నెరవేర్చుకున్న హీరో కార్తికేయ..

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కార్తికేయ తన చిన్ననాటి కలను నెరవేర్చుకున్నాడు. తెలుగు ఇండస్ట్రీలో హీరోగా, విలన్ గా చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు కార్తికేయ. ఇటీవలే తన పుట్టినరోజునాడు కొత్త సినిమాను ప్రకటించాడు ఈ యువహీరో. ఇక విషయానికి వస్తే.. కార్తికేయ, మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని అని మనందరికీ తెలిసిందే. చిరంజీవి...

Kartikeya Gummakonda : తన చిన్ననాటి కలను నెరవేర్చుకున్న హీరో కార్తికేయ..

Hero Kartikeya fulfil his childhood dream

Updated On : November 23, 2022 / 2:43 PM IST

Kartikeya Gummakonda : టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కార్తికేయ తన చిన్ననాటి కలను నెరవేర్చుకున్నాడు. తెలుగు ఇండస్ట్రీలో హీరోగా, విలన్ గా చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న కార్తికేయ.. క్రిందట ఏడాది ‘చావు కబురు చల్లగా’, ‘రాజావిక్రమార్క’ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ ప్రేక్షకుల ముందుకు వచ్చి, ఈ ఏడాది ఒక్క సినిమాని కూడా విడుదల చేయలేకపోయాడు.

Hero Kartikeya: ‘డీజే టిల్లు’ హీరోయిన్‌తో కార్తికేయ కొత్త మూవీ.. ఆసక్తికరంగా ఉన్న టైటిల్!

ఇటీవలే తన పుట్టినరోజునాడు కొత్త సినిమాను ప్రకటించాడు ఈ యువహీరో. ఇక విషయానికి వస్తే.. కార్తికేయ, మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని అని మనందరికీ తెలిసిందే. చిరంజీవి ‘లంకేశ్వరుడు’ సినిమాలో చిరుత పులిపై చిరు చెయ్యి వేసి ఉన్న సీన్ అందరికి ఫేవరెట్. కాగా లైఫ్ లో ఒక్కసారి అయిన చిరంజీవిలా అలా చిరుతతో ఫోటో దిగాలి అనుకున్న కార్తికేయ.. ఎట్టకేలకు తన డ్రీమ్ ని ఫుల్ ఫిల్ చేసుకున్నాడు.

‘అడవి నాదే వేట నాదే చిరుత’ అంటూ చిరంజీవిలా చిరుతతో పోజు ఇస్తున్న ఫోటోను షేర్ చేస్తూ.. “లంకేశ్వరుడు సినిమాని టీవిలో చూస్తున్నప్పుడు నుంచి ఇది నా కల. ఇప్పుడు నెరవేరింది” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఫోటో చూసిన అభిమానులు ‘చిరంజీవి నిజమైన అభిమాని’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా కార్తికేయ 8వ చిత్రం “బెదురు లంక” శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.