Chiranjeevi: నేను రాజకీయాల్లో కొనసాగి ఉంటే ఏపీకి మారేవాడిని.. చిరంజీవి!

ఈ దసరాకు మెగాస్టార్ చిరంజీవి "గాడ్‌ఫాదర్" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే విడుదలకు ముందు మూవీ టీం పనిలో జాప్యం కారణంగా సినిమాను జోరుగా ప్రమోట్ చేయలేకపోయింది. ఇక రిలీజ్ తరువాత ఆ భాద్యతలు చిరు తీసుకుని సినిమాను బలంగా ప్రమోట్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఈరోజు మీడియాతో ముచ్చటించారు.

Chiranjeevi: నేను రాజకీయాల్లో కొనసాగి ఉంటే ఏపీకి మారేవాడిని.. చిరంజీవి!

If Chiru continued in politics he would like to switched to AP

Updated On : October 13, 2022 / 5:18 PM IST

Chiranjeevi: ఈ దసరాకు మెగాస్టార్ చిరంజీవి “గాడ్‌ఫాదర్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే విడుదలకు ముందు మూవీ టీం పనిలో జాప్యం కారణంగా సినిమాను జోరుగా ప్రమోట్ చేయలేకపోయింది. ఇక రిలీజ్ తరువాత ఆ భాద్యతలు చిరు తీసుకుని సినిమాను బలంగా ప్రమోట్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఈరోజు మీడియాతో ముచ్చటించారు.

Chiranjeevi: తనకిష్టమైన రాజకీయ నాయకుడు ఎవరనేది బయటపెట్టిన మెగాస్టార్..

ఈ సినిమా రాజకీయ నేపథ్యంలో తెరకెక్కడంతో, చిరు రాజకీయ ప్రస్థానం గురించి మళ్ళీ జోరుగా చర్చలు జరుగుతున్నాయి. దీంతో ఒక విలేకరి ఈ విషయాన్ని తెలియజేస్తూ.. “ఏపీలో రాజకీయ శూన్యత నెలకొంది. పాలిటిక్స్ లో కొనసాగనందుకు మీరేమన్న పశ్చాత్తాప పడుతున్నారా” అని ప్రశ్నించగా, దానికి మెగాస్టార్ చాలా సున్నితంగా బదులిచ్చాడు.

“రెండు రాష్ట్రాల ప్రజలు నన్ను ఎంతగానో ప్రేమిస్తారు. నాకు అందుకు చాలా సంతోషంగా ఉంటుంది. కానీ ఒకవేళ నేను రాజకీయ పార్టీని కొనసాగించి ఉంటే, నేను ఆంధ్రప్రదేశ్‌కు మారేవాడిని” అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఇటీవల, తాను భవిషత్తు కాలంలో జనసేనలో చేరవచ్చు అని వ్యాఖ్యానించిన సంగతి మనకి తెలిసిందే.