ప్రభాస్‌తో పెళ్లయితే ప్రతిరోజూ పండగే : కాజల్ మనసులో మాట

మంచు ల‌క్ష్మి వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న ‘ఫీట్ అప్ విత్ ది స్టార్స్’ ప్రోగ్రామ్‌లో రీసెంట్‌గా కాజ‌ల్ పార్టిసిపెట్ చేసింది..

  • Published By: sekhar ,Published On : October 29, 2019 / 07:00 AM IST
ప్రభాస్‌తో పెళ్లయితే ప్రతిరోజూ పండగే : కాజల్ మనసులో మాట

మంచు ల‌క్ష్మి వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న ‘ఫీట్ అప్ విత్ ది స్టార్స్’ ప్రోగ్రామ్‌లో రీసెంట్‌గా కాజ‌ల్ పార్టిసిపెట్ చేసింది..

టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ రెబల్‌స్టార్ ప్రభాస్ ఇటీవలే 40వ ఏట అడుగుపెట్టాడు.. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అనే ప్రశ్నకి సమాధానం దొరికింది కానీ, ప్రభాస్ పెళ్లెప్పుడవుతుంది? అనే దానికి మాత్రం ఆన్సర్ తెలీదు.. ఎంతోమంది అమ్మాయిలు తమ కలల రాకుమారుడిగా డార్లింగ్‌ని ఊహించుకుంటున్నారు.

ప్రభాస్ ఓకే అంటే వైఫ్ అవడానికి రెడీగా ఉన్నారు.. ఈ లిస్ట్‌లో కలువ కళ్ల చిన్నది కాజల్ అగర్వాల్ కూడా చేరింది.. ప్రభాస్‌ని పెళ్లి చేసుకోవడానికి తాను రెడీ అని చెప్పింది.. వివరాల్లోకి వెళ్తే… మంచు ల‌క్ష్మి వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న ‘ఫీట్ అప్ విత్ ది స్టార్స్’ ప్రోగ్రామ్‌లో రీసెంట్‌గా కాజ‌ల్ పార్టిసిపెట్ చేసింది.  

Read Also : తారకరత్న ‘ఎస్5’ ప్రారంభం : ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ విడుదల

రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌, ప్ర‌భాస్‌ల‌లో ఎవ‌రిని చంపుతావు? ఎవ‌రితో లేచిపోతావు? ఎవ‌ర్ని పెళ్లి చేసుకుంటావు? అని ల‌క్ష్మీ ప్ర‌స‌న్న, కాజ‌ల్‌ని అడిగింది. ‘రామ్‌చ‌ర‌ణ్‌ను చంపేస్తా.. ఎన్టీఆర్‌తో లేచిపోతాను.. ప్ర‌భాస్‌ను పెళ్లి చేసుకుంటాన‌ు’ అని ఆన్సర్ ఇచ్చింది కాజల్.. ఈ ముగ్గురిలో ప్ర‌భాస్‌కు మాత్ర‌మే పెళ్లి కాలేదు కాబ‌ట్టి త‌న‌ను పెళ్లి చేసుకుంటాన‌ని కాజ‌ల్ చెప్పడం విశేషం..