Karate Kalyani : యూట్యూబ్ ప్రాంక్ యాక్టర్ శ్రీకాంత్ పై దాడి చేసిన కరాటే కళ్యాణి | Karate Kalyani attacked on prank actor sreekanth

Karate Kalyani : యూట్యూబ్ ప్రాంక్ యాక్టర్ శ్రీకాంత్ పై దాడి చేసిన కరాటే కళ్యాణి

గురువారం రాత్రి హైదరాబాద్ యూసుఫ్ గూడ బస్తీలో శ్రీకాంత్ ని సినీనటి కరాటే కల్యాణితో పాటు మరి కొంతమంది కలిసి చితకబాదారు. ప్రాంక్ పేరుతో మహిళలపై ఇష్టం వచ్చినట్లు................

Karate Kalyani : యూట్యూబ్ ప్రాంక్ యాక్టర్ శ్రీకాంత్ పై దాడి చేసిన కరాటే కళ్యాణి

Karate Kalyani :  శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి యూట్యూబ్ లో ప్రాంక్స్ చేస్తూ ఉంటాడు. అయితే వాటిలో కొన్ని సార్లు రోడ్డు మీద మహిళలని ప్రాంక్ పేరుతో అవమానానికి గురయ్యేలా చేస్తాడు. మరి కొన్ని సార్లు స్క్రిప్టెడ్ వీడియోస్ తీసి అందులో అడల్ట్ కంటెంట్ తో మహిళలతో ప్రాంక్ పేరుతో శృతిమించుతాడు. తాజాగా శ్రీకాంత్ పై ప్రముఖ నటి కరాటే కళ్యాణి గురువారం రాత్రి దాడి చేయగా ఆ వీడియోలు వైరల్ గా మారాయి.

గురువారం రాత్రి హైదరాబాద్ యూసుఫ్ గూడ బస్తీలో శ్రీకాంత్ ని సినీనటి కరాటే కల్యాణితో పాటు మరి కొంతమంది కలిసి చితకబాదారు. ప్రాంక్ పేరుతో మహిళలపై ఇష్టం వచ్చినట్లు శ్రీకాంత్ చేతులు వేస్తున్నాడు, ప్రాంక్ పేరుతో అమ్మాయిలను ఫ్లర్టింగ్ చేసి మహిళల గౌరవాన్ని దెబ్బతిస్తున్నాడు, ఒంటరిగా వెళ్తున్న మహిళలను రెచ్చగొట్టి కోరికలు తీర్చుకుంటున్నాడు అంటూ కల్యాణి ఆగ్రహం వ్యక్తం చేసి మరి కొంతమందితో కలిసి శ్రీకాంత్ బట్టలు ఊడదీసి రోడ్లపై పరిగెత్తించి కొట్టింది.

Esha Gupta: ఈషా ఘాటు పోజులు.. ఏం మెసేజ్ ఇద్దామని!

ఆ తర్వాత కూడా ఇద్దరూ యూసఫ్ గూడ మెయిన్ రోడ్డుపై చాలా సేపు వాదులాడుకున్నారు. శ్రీకాంత్ పై కరాటే కళ్యాణి దాడి చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

×