Nikhil : కార్తికేయ 2 సినిమా.. త్వరలో ఆ లాంగ్వేజ్ లో కూడా రిలీజ్..

ఇప్పటికే తెలుగు, హిందీ భాషల్లో రిలీజైన కార్తికేయ 2 సినిమా త్వరలో మరో భాషలో కూడా రిలీజ్ కాబోతుంది. ఈ మేరకు నిఖిల్ అధికారిక ప్రకటన చేశాడు. కార్తికేయ 2 సినిమా మలయాళంలో సెప్టెంబర్ 23 నుంచి.................

Nikhil : కార్తికేయ 2 సినిమా.. త్వరలో ఆ లాంగ్వేజ్ లో కూడా రిలీజ్..

Karthikeya 2 Will release in Malayalam

 

Karthikeya 2 : నిఖిల్ హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో గతంలో వచ్చిన కార్తికేయ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన కార్తికేయ 2 సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. చాలా చిన్న సినిమాగా రిలీజ్ అయి పెద్ద విజయం సాధించింది. ఇప్పటికే 120 కోట్ల గ్రాస్ కలెక్షన్లని సాధించి మరిన్ని కలెక్షన్ల వైపుకు దూసుకుపోతుంది. రోజు రోజుకి ఈ సినిమాకి దేశమంతటా ప్రశంసలు పెరుగుతున్నాయి. అన్ని ప్రాంతాల ప్రేక్షకులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఈ సినిమాని అభినందిస్తున్నారు.

Paruchuri Gopala Krishna : సీతారామం క్లైమాక్స్ మారిస్తే ఇంకోలా ఉండేదేమో.. సినిమా చూసి నేను ఏడవలేదు.. పరుచూరి వ్యాఖ్యలు..

ఇప్పటికే తెలుగు, హిందీ భాషల్లో రిలీజైన కార్తికేయ 2 సినిమా త్వరలో మరో భాషలో కూడా రిలీజ్ కాబోతుంది. ఈ మేరకు నిఖిల్ అధికారిక ప్రకటన చేశాడు. కార్తికేయ 2 సినిమా మలయాళంలో సెప్టెంబర్ 23 నుంచి రిలీజ్ కాబోతుంది. E4 సినిమాస్ సంస్థ అక్కడ కార్తికేయ 2ని రిలీజ్ చేయనుంది. ఇక ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ కావడంతో, అనుపమ మలయాళ నటి కావడంతో అక్కడ కూడా సినిమాకి మరింత రీచ్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా తెలుగు, హిందీ భాషల్లో భారీ విజయం సాధించిన కార్తికేయ 2 సినిమా త్వరలో మలయాళంలో కూడా విజయం సాధించడానికి రెడీ అవుతుంది. ఈ మేరకు అధికారిక మలయాళ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు.