Paruchuri Gopala Krishna : సీతారామం క్లైమాక్స్ మారిస్తే ఇంకోలా ఉండేదేమో.. సినిమా చూసి నేను ఏడవలేదు.. పరుచూరి వ్యాఖ్యలు..

పరుచూరి గోపాలకృష్ణ ఈ వీడియోలో సీతారామం సినిమా గురించి మాట్లాడుతూ.. ''ఇది కేవలం ప్రేమ కథ మాత్రమే కాదు. ఇందులో ప్రేమ కథ, దేశం కథ, త్యాగం కథ.. మూడు కథలు ఉన్నాయి. మూడు కథలని దర్శకుడు అంతర్లీనంగా అద్భుతంగా............

Paruchuri Gopala Krishna : సీతారామం క్లైమాక్స్ మారిస్తే ఇంకోలా ఉండేదేమో.. సినిమా చూసి నేను ఏడవలేదు.. పరుచూరి వ్యాఖ్యలు..

Paruchuri Gopala Krishna comments on Sita Ramam Movie

Paruchuri Gopala Krishna :  దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో వైజయంతి మూవీ బ్యానర్ లో తెరకెక్కిన సీతారామం సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. థియేటర్లలో ఈ సినిమా చూసి ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకున్నారు. సీతారామం సినిమా ప్రేక్షకుల మనసులని హత్తుకుంది. తాజాగా శుక్రవారం నుంచి ఈ సినిమా అమెజాన్ ఓటీటీ లో స్ట్రీమ్ అవుతుంది.

ఇప్పటికే ప్రేక్షకుల నుంచి, పలువురు ప్రముఖుల నుంచి అభినందనలు అందుకుంది ఈ చిత్ర యూనిట్. తాజాగా ఈ సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ పలు వ్యాఖ్యలు చేశారు. పరుచూరి పలుకులు అనే పేరుతో గోపాలకృష్ణ యూట్యూబ్ లో ఓ ఛానల్ నిర్వహిస్తూ సినిమాలపై విశేషణాలు ఇస్తూ ఉంటారు. తాజాగా పరుచూరి సీతారామం సినిమా గురించి విశ్లేషిస్తూ ఓ వీడియోని రిలీజ్ చేశారు.

పరుచూరి గోపాలకృష్ణ ఈ వీడియోలో సీతారామం సినిమా గురించి మాట్లాడుతూ.. ”ఇది కేవలం ప్రేమ కథ మాత్రమే కాదు. ఇందులో ప్రేమ కథ, దేశం కథ, త్యాగం కథ.. మూడు కథలు ఉన్నాయి. మూడు కథలని దర్శకుడు అంతర్లీనంగా అద్భుతంగా రాసుకున్నాడు. గతంలో ఇలాంటి సినిమాలు వచ్చాయి. షారుఖ్‌ ఖాన్‌, ప్రీతీ జింటా, రాణీ ముఖర్జీ ప్రధాన పాత్రలు పోషించిన వీర్‌జారా సినిమా కూడా ఆల్మోస్ట్ ఇలాంటి కథే. కాకపోతే అందులో క్లైమాక్స్ లో హీరో, హీరోయిన్స్ కలుస్తారు. కానీ సీతారామం సినిమాలో దర్శకుడు విషాదాంతం ఇచ్చాడు.”

Brahmastra Review : బ్రహ్మాస్త్ర రివ్యూ.. కేవలం విజువల్ ఫీస్ట్ మాత్రమేనా??

”హను రాఘవపూడి ప్రేమ కథగా కాకుండా మూడు కథలు కలిపి చాలా బాగా చెప్పాడు. ప్రేమకథని ఇంకా అద్భుతంగా తీర్చిదిద్దొచ్చు. చాలా మంది ఈ సినిమాని చూసి ఏడుస్తున్నారు. నేను థియేటర్లో చూసినప్పుడు కూడా చాలా మంది ఏడ్చారు. కానీ నాకు ఏడుపు రాలేదు. నేను సినిమాని ఒక రచయితగా చూస్తాను కాబట్టి నాకు సినిమా చూసేటప్పుడు ఏడుపు రాలేదు. అయితే సినిమా చాలా మందికి నచ్చింది. నేను ఎవర్ని అడిగినా చాలా మంది బాగుంది అన్నారు. ఎక్కడో ఒకరు క్లైమాక్స్ మారిస్తే బాగుండు అని చెప్పారు. నా వరకు కూడా క్లైమాక్స్ మారిస్తే బాగుండు అనిపించింది. హీరోని బతికి ఉంచితే బాగుండేది. క్లైమాక్స్ లో హీరో, హీరోయిన్ ని కలిపితే ఇంకా బాగుండేదేమో అని నాకు అనిపించింది. అయితే దర్శకుడు, హీరో, నిర్మాత అందరికి ఆ విషాద క్లైమాక్స్ నచ్చింది. ప్రేక్షకులకి కూడా అదే నచ్చి ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఒకవేళ క్లైమాక్స్ మార్చి వాళ్ళిద్దర్నీ కలిపేస్తే ఇంతమంది ప్రేక్షకులని కన్నీళ్లు పెట్టించేది కాదేమో సినిమా” అని అన్నారు.