మంజు భార్గవిని పెళ్లాడిన యోగిబాబు – రిసెప్షన్ ఎప్పుడంటే..

ప్రముఖ తమిళ హాస్యనటుడు యోగి బాబు వివాహం తమిళనాడు తిరుత్తణిలోని మురుగన్‌ ఆలయంలో ఘనంగా జరిగింది..

  • Published By: sekhar ,Published On : February 5, 2020 / 12:44 PM IST
మంజు భార్గవిని పెళ్లాడిన యోగిబాబు – రిసెప్షన్ ఎప్పుడంటే..

ప్రముఖ తమిళ హాస్యనటుడు యోగి బాబు వివాహం తమిళనాడు తిరుత్తణిలోని మురుగన్‌ ఆలయంలో ఘనంగా జరిగింది..

తమిళ స్టార్‌కమెడియన్‌యోగిబాబు ఓ ఇంటివాడయ్యారు. అంటే కొత్త ఇళ్లు కొనుక్కున్నాడనుకునేరు.. యోగి బాబు పెళ్లి చేసుకున్నారు. తమిళనాడు తిరుత్తణిలోని మురుగన్‌ఆలయంలో బుధవారం ఉదయం మంజు భార్గవితో ఆయన వివాహం జరిగింది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులతోపాటు అతికొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. అయితే సినీ పరిశ్రమలోని తన సన్నిహితుల కోసం యోగి మార్చిలో చెన్నైలో గ్రాండ్‌ రిసెప్షన్‌ ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం.

యోగి, భార్గవిలది పెద్దలు కుదిర్చిన వివాహమని తెలుస్తోంది. యోగి బాబు వివాహం గురించి తెలిసి పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలియచేస్తున్నారు. యోగి బాబుకి కమెడియన్‌గా తమిళనాట విశేషమైన క్రేజ్‌ఉన్న సంగతి తెలిసిందే. పలు డబ్బింగ్‌సినిమాల ద్వారా ఆయన మన తెలుగు ప్రేక్షకులకు కూడా తెలుసు. ఇటీవల సూపర్ స్టార్ రజనీకాంత్‌‘దర్బార్‌’ చిత్రంలో యోగి ముఖ్య పాత్రలో నటించి ఆకట్టుకున్నారు.

యోగిబాబు ప్రధాన పాత్రలో ‘Cocktail’ అనే సినిమా రూపొందుతుంది. తాజాగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ గురించి వివాదం చెలరేగింది. పోస్టర్‌లో తమిళులు ఆరాధించే దైవం మురుగన్‌వేషధారణలో ఉన్న యోగిబాబు స్టిల్‌‌పై  విమర్శలు రాగా.. చిత్రబృందం వివరణ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. ప్రస్తుతం మారి సెల్వరాజ్‌దర్శకత్వంలో స్టార్ హీరో ధనుష్‌తో కలిసి ‘కర్ణన్‌’ చిత్రంలో యోగి బాబు నటిస్తున్నారు.